Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారికి టాలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టండి!

|

Oct 06, 2021 | 9:17 AM

Tollywood: సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన కంటెంట్ వైరల్ అవుతూనే ఉంటాయి. వారి చిన్నప్పటి ఫోటోల దగ్గర నుంచి ఫిల్మ్ అప్‌డేట్స్...

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారికి టాలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టండి!
Follow us on

సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన కంటెంట్ వైరల్ అవుతూనే ఉంటాయి. వారి చిన్నప్పటి ఫోటోల దగ్గర నుంచి ఫిల్మ్ అప్‌డేట్స్ వరకు అన్నింటినీ కూడా ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేసేస్తారు. ఈ మధ్యకాలంలో ‘Throwback Thursday’ ట్రెండ్ ఎక్కువైంది. ఈ ట్యాగ్‌తో సినీ సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఆ కోవలో ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారికి ప్రస్తుతం టాలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్‌గా పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, దళపతి విజయ్, విజయ్ సేతుపతి వంటి సూపర్ స్టార్స్‌ సరసన నటించి మెప్పించింది. అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సైతం తన మార్క్‌ను చూపించింది. ఎవరనుకుంటున్నారా.? ఈపాటికి మీకు అర్ధమైపోతుంది. ఆమెవరో కాదు సమంతా.

ప్రస్తుతం సమంతా ‘శాకుంతలం’, ‘కాతు వక్కుల రెందు కాదల్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే సామ్-చైతూలు విడాకులు తీసుకోవడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకైన సంగతి తెలిసిందే. సమంత, నాగచైతన్య విడిపోవడంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా.. అభిమానులు సైతం తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

Also Read:

మొసలిని నమిలి తినేసిన మరో మొసలి.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!