ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా.. అభిమానులకు తమ ఫేవరేట్ హీరోహీరోయిన్స్ మధ్య అనుబంధాన్ని మరింత వ్యాప్తి చేస్తుంది. తమ అభిమాన నటీనటుల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. అలా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ముద్దుగుమ్మకు సంబంధించిన చిన్ననాటి ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
పైన ఫోటోలో బూరె బుగ్గలతో ఫోటోకు పోజిస్తున్న ఓవర్ లోడెడ్ క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్న చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా కొనసాగుతుంది. సుధీర్ఘకాలంగా టాప్ హీరోయిన్గా వరుస సూపర్ హిట్ చిత్రాల్ల నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల మనసు దొచుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ వరుస పెట్టి వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ చిన్నారి నటనకు సినీ ప్రముఖులు సైతం అట్రాక్ట్ అవుతుంటారు. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సామాజిక సేవలోనూ ముందుంటుంది ఈ అమ్మడు.
స్వయంగా సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మందికి తనవంతూ సాయం చేస్తుంది. ఇప్పటికీ ఈ చిన్నారి క్రేజ్ తగ్గడం లేదు. స్టార్ హీరోలందరితో స్క్రీన్ చేసుకున్న ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో యమా క్రేజ్. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో ఉన్న చిన్నారి మరేవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఏమాయ చేసావే అంటూ తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన సామ్.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. విడాకుల అనంతరం సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది. అలాగే త్వరలోనే సామ్ బాలీవుడ్.. హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సమంత.. అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది.
ఏపీలో టికెట్ ధరల తగ్గింపు నిర్ణయంపై నిర్మాతల అసహనం.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్..