Major Movie : కీలక పాత్ర కోసం సయీ మంజ్రేకర్

అడవి శేష్..ఈ పేరు  ఇప్పుడు టాలీవుడ్  లో సెన్సేషన్ గా మారింది. నటుడిగా, రచయితగా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు ఇతగాడు​.

  • Ram Naramaneni
  • Publish Date - 5:47 pm, Thu, 24 September 20
Major Movie : కీలక పాత్ర కోసం సయీ మంజ్రేకర్

అడవి శేష్..ఈ పేరు  ఇప్పుడు టాలీవుడ్  లో సెన్సేషన్ గా మారింది. నటుడిగా, రచయితగా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు ఇతగాడు​. తాజాగా 26/11 ముంబై దాడుల ఆధారంగా తీస్తున్న ‘మేజర్​’లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్​డేట్​ను సోషల్ మీడియా ద్వారా తెలిపాడు శేష్​. ఇందులో సయీ మంజ్రేకర్ కీలకపాత్ర కోసం ఎంపిక చేసినట్లు ప్రకటించాడు. ​అక్టోబరు నుంచి ఆమె​ షూటింగ్ లో పాల్గొననుందని చెప్పాడు.

ఎన్​ఎస్​జీ కమాండర్ మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్ జీవత చరిత్ర నేపథ్యంలో ​’మేజర్’ తెరకెక్కుతోంది. 26/11 దాడుల సమయంలో తాజ్​​ హోటల్​లో చిక్కుకున్న 14 మందిని రక్షించే క్రమంలో సందీప్​ ఉన్నికృష్ణన్ ప్రాణాలను కోల్పోయారు.​ ఈ ప్రాజెక్టును సూపర్​స్టార్ మహేశ్​బాబు జీఎమ్​బీ ఎంటర్​టైన్​మెంట్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Also Read :

ఐపీఎల్ కామెంట్రీ కోసం ముంబై వచ్చి, గుండెపోటుతో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మృతి

మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్