
Love Story Twitter Review: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటించిన సినిమా లవ్ స్టోరీ.. అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు.. ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ముచ్చటైన ప్రేమకథను కూడా తన సినిమాలో చూపిస్తాడు శేఖర్ కమ్ముల. ఈ క్రమంలో వచ్చిన సినిమానే లవ్ స్టోరీ. గామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది . నేడు( 24న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..
మొదటిసారి నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. అంతే కాదు ఈ సినిమాలో చైతన్య డాన్స్ లుకూడా ఇరగదీశారు. డాన్స్‌ల కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు. ఏదో సాదించడం కోసం హైదరాబాద్ వచ్చిన హీరో హీరోయిన్ పడ్డ కష్టాలను చూపిస్తూనే… వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమను… ఆ ప్రేమను పెళ్లిపీటలవరకు తీసుకెళ్లే క్రమంలో వారు ఎదురుకున్న కష్టాలను సినిమాలో చూపించారని తెలుస్తుంది. అలాగే సాయి పల్లవి ఎప్పటిలానే తన నటనతో డ్యాన్స్ లతో ఆకట్టుకుంది. ఈ సినిమా చుసిన వాళ్ళందరూ చైతన్య పర్ఫామెన్స్ గురించే ప్రస్తావిస్తున్నారు. సినిమా ఆద్యంతం ఆకట్టుకున్నప్పటికీ క్లైమాక్స్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సెన్సిటివ్ పాయింట్స్ టచ్ చేసిన శేఖర్ కమ్ముల సినిమా ఎలా తెరకెక్కించారో చూడాలి. ట్విట్టర్ వేదికగా ప్రేక్షకుల లవ్ స్టోరీ గురించి ఏమంటున్నారంటే…
మరిన్ని ఇక్కడ చదవండి :