ఆ నిర్ణయాన్ని మార్చుకుంటున్నా.. ఆర్జీవీ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్

|

Oct 12, 2024 | 7:10 PM

శ్రీలక్ష్మీ సతీష్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ ఆరాధ్య దేవి అంటే ఠక్కున గుర్తొస్తుంది. చీరకట్టులో ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ..

ఆ నిర్ణయాన్ని మార్చుకుంటున్నా.. ఆర్జీవీ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్
Tollywood
Follow us on

శ్రీలక్ష్మీ సతీష్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ ఆరాధ్య దేవి అంటే ఠక్కున గుర్తొస్తుంది. చీరకట్టులో ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో ‘శారీ’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుండగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఓ సంచలన ప్రకటన చేసింది. అదేంటంటే..

‘గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానని గతంలో ప్రామిస్ చేశాను. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాను. కాలం మారుతున్న కొద్దీ అభిప్రాయాలు మారుతుంటాయి. అలాగే జీవితంలో ఎదురయ్యే అనుభవాలే.. మన నిర్ణయాలను మారుస్తాయి. 22 ఏళ్ల అప్పుడు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని అనుకున్నా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాను. గ్లామర్ అనేది ఇప్పుడు నా వృత్తిగా మారింది. ఎలాంటి పాత్రల్లోనైనా నటించడానికి సిద్దం. ఉత్తమ పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను’ అని రాసుకొచ్చింది ఆరాధ్య దేవి. ఇది చూసి నెటిజన్లు దెబ్బకు షాక్ అవ్వడమే కాదు.. మరింత హాట్ షో చేస్తే తట్టుకోలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి