సారీ బాస్..ఇది ఫేస్ యాప్!

ఉదయం నుంచి సోషల్ మీడియా వ్యాప్తంగా ఓ ఫోటో ట్రెండ్ అవుతోంది.  ‘మాస్‌ మహారాజా’ రవితేజ వింటేజ్ లుక్‌లో ఉన్న ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఇంత యంగ్‌గా ఎలా మారిపోయారని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఆయన కొత్త సినిమా ‘డిస్కోరాజా’ చిత్రం కోసం ఇలా తయారయ్యారని వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ ఫేక్. అదంతా ఫేస్‌యాప్‌ మహిమ. ఏది ఏమైనా ‘సింధూరం’ నాటి లుక్‌లో రవితేజను చూసి ఫ్యాన్స్ మెస్మరైజ్ అయ్యారు.  ‘డిస్కోరాజా’ ప్రస్తుతం […]

సారీ బాస్..ఇది ఫేస్ యాప్!
Ravi Teja Youung look Is fake

Updated on: Aug 24, 2019 | 9:39 PM

ఉదయం నుంచి సోషల్ మీడియా వ్యాప్తంగా ఓ ఫోటో ట్రెండ్ అవుతోంది.  ‘మాస్‌ మహారాజా’ రవితేజ వింటేజ్ లుక్‌లో ఉన్న ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఇంత యంగ్‌గా ఎలా మారిపోయారని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఆయన కొత్త సినిమా ‘డిస్కోరాజా’ చిత్రం కోసం ఇలా తయారయ్యారని వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ ఫేక్. అదంతా ఫేస్‌యాప్‌ మహిమ. ఏది ఏమైనా ‘సింధూరం’ నాటి లుక్‌లో రవితేజను చూసి ఫ్యాన్స్ మెస్మరైజ్ అయ్యారు.  ‘డిస్కోరాజా’ ప్రస్తుతం సెట్స్‌పై ఉండగా..  ‘మహాసముద్రం’  సినిమా తెరకెక్కనుంది. ఆ మూవీకి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజయ్‌ భూపతి దర్శకుడు.