
కన్నడ సోయగం రష్మిక మందన్న (Rashmika Mandanna ) ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ బ్యూటీ. తెలుగులోనే కాకుండా.. కన్నడ, తమిళ్, హిందీలోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ అగ్ర హీరోయిన్గా దూసుకుపోతుంది. ఇటీవలే పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు సందర్భంగా .. తన రాబోయే చిత్రాల నుంచి వరుస అప్డే్ట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ హను రాఘవపూడి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మరో స్టార్ హీరో సరసన నటించనుంది.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ నేరుగా తెలుగులో చేస్తోన్న మూవీ ఇది. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న తలపతి విజయ్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి జాతీయ అవార్డు పొందిన నిర్మాత దిల్ రాజు & శిరీష్ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. సక్సెస్ ఫుల్ కలయికలో రాబోతున్న ఈ చిత్రం అంతే సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దబోతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రంలో విజయ్‌ని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి వంశీ పైడిపల్లి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
Also Read: Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‌పుల్ యాక్షన్‌తో అదరగొట్టిన విజయ్ దళపతి..
Kangana Ranaut: బాలీవుడ్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్.. వాళ్లంతా ఫెయిల్యూర్స్ అంటూ..