Rao Ramesh: ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. ఇప్పుడతను మన మధ్య లేకపోవడం నమ్మలేపోతున్నా: రావు రమేష్

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రముఖ నటుడు రావు రమేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో చిన్న తనంలోనే చనిపోయిన ఓ హీరోను గుర్తుకు తెచ్చుకుని బాగా ఎమోషనల్ అయ్యారు.

Rao Ramesh: ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. ఇప్పుడతను మన మధ్య లేకపోవడం నమ్మలేపోతున్నా: రావు రమేష్
Rao Ramesh

Updated on: Jul 24, 2026 | 9:55 AM

టాలీవుడ్ సీనియర్ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నా ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. కేవలం సహాయక నటుడిగానే కాకుండా, విలన్ గానూ అప్పుడప్పుడు కమెడియన్ గానూ జనాలను అలరిస్తున్నారు రావు రమేష్. ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడలోనూ సినిమాలు చేస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో పేరుగాంచిన నటుడు కోమల్ కుమార్, ప్రస్తుతం ‘తెనాలి డిఎ, ఎల్‌ఎల్‌బి’తో ప్రేక్షకుల ముందుక రానున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు రావు రమేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ ‘తెనాలి డిఎ, ఎల్‌ఎల్‌బి’ సినిమా కోసం రావు రమేష్ తన పాత్రకు కన్నడలో స్వయంగా ఆయనే డబ్బింగ్ చెప్పనున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ కు హాజరయ్యారు రావు రమేష్. ఈ సందర్భంగా తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో కర్ణాటక రత్న, దివంగత హీరో డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్‌తో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘మైసూరులో కేజీఎఫ్ 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను హోటల్ లో ఉన్నాను. అప్పుడు అప్పు సార్ అక్కడికి వచ్చారు. ఆయన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ ఆయన నన్ను గుర్తుపట్టి, “సార్, మీరు అద్భుతమైన నటుడు” అని ప్రశంసించారు. అంతేకాదు, “సార్, మా ఇంటికి రండి.. కలిసి భోజనం చేద్దాం” అని ప్రేమగా ఆహ్వానించారు. కానీ ఈ రోజు ఆయన మనతో లేరు. చిన్నతనంలోనే ఆయన ఈ లోకాన్ని విడచి పెట్టి వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నా’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రావు రమేష్.

కాగా తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు రావు రమేష్. నిఖిల్ కుమారస్వామి ‘జాగ్వార్’ చిత్రంతో కన్నడ ఆడియెన్స్ ను మొదటిసారిగా పలకరించారు రావు రమేష్. ఆ తర్వాత, ఆయన ప్రశాంత్ నీల్- యశ్ కాంబినేషన్ లో వచ్చిన ‘KGF 2’లో నటించారు. ఈ చిత్రంలో, ఆయన ఒక సీబీఐ అధికారి పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు. విశేషం ఏమిటంటే కేజీఎఫ్ 2 చిత్రంలో కూడా రావు రమేష్ తన పాత్రకు స్వయంగా కన్నడలో డబ్బింగ్ చెప్పారు. ఆయన గంభీరమైన స్వరం, అద్భుతమైన సంభాషణల నైపుణ్యం కన్నడిగులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించాయి. ప్రస్తుతం రావు రమేష్ చేతిలో పలు తెలుగు, కన్నడ సినిమాలు ఉన్నాయి.

Rao-Ramesh, Puneeth Rajkumar

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us