Rangde Movie Update : సమ్మరే సినిమాకు సేఫ్ అంటున్న ‘రంగ్ దే’ టీమ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

యంగ్ హీరో నితిన్ గత ఏడాది 'బీష్మ' సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్..

Rangde Movie Update : సమ్మరే సినిమాకు సేఫ్ అంటున్న రంగ్ దే టీమ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Updated on: Jan 01, 2021 | 4:05 PM

Rangde Movie Update : యంగ్ హీరో నితిన్ గత ఏడాది ‘బీష్మ’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతర్వాత అదే జోష్ తో ‘రంగ్ దే’ సినిమాను పట్టాలెక్కించాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని పుకార్లు షికారు చేసాయి. ఆ వార్తలను చిత్రయూనిట్ ఖండించింది. ఎట్టిపరిస్థితుల్లో సినిమాను థియేట్సర్స్ లోనే రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమాను సమ్మర్ కు విడుదల చేయాలనీ చిత్రయూనిట్ భావిస్తుందని తెలుస్తుంది. సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాలన్నీ సంక్రాంతిని టార్గెట్ చేసుకొని విడుదల అవుతున్నాయి. ఇంత పోటీలో సినిమా రిలీజ్ చేయడం కంటే సమ్మర్ కు విడుదల చేయడమే మంచిదని రంగ్ దే చిత్రయూనిట్ అనుకుంటున్నారట. మార్చి 26 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. ఈ సమయంలో వేసవి సెలవులతోపాటు హోలీ సెలవులు కూడా కలిసొస్తాయని భావిస్తున్నారు. ఈ వార్తలో వాస్తవమెంత అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

also read : Rakul About Corona: రకుల్‌ కరోనాను ఎలా జయించిందో తెలుసా..? స్వానుభవం వివరించిన హీరోయిన్..

Loading...
Unable to load recommendations.
Follow Us