Ramayana Movie: రామాయణం మూవీ.. ‘జయ జయ రామ్’ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది.. లిరికల్ వీడియో ఇదిగో

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతారాములుగా నటిస్తోన్న చిత్రం రామాయణ. ఈ చిత్రానికి దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.

Ramayana Movie: రామాయణం మూవీ.. జయ జయ రామ్ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది.. లిరికల్ వీడియో ఇదిగో
Ramayana Movie

Updated on: Sep 25, 2026 | 10:03 PM

రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా తెరకెక్కిన సినిమా ‘ రామాయణం’. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్, ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామయాణం సినిమా ట్రైలర్ యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్‌ చేశారు. జయ జయ రామ్‌ అనే పాట హిందీ వర్షన్ విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ కూడా సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్ తెలుగు వర్షన్ కూడా వచ్చేసింది. ఈ సాంగ్‌లో రాముడిగా రణ్‌వీర్‌ కపూర్‌.. సీతగా సాయి పల్లవి ఎంతో అందంగా కనిపించారు. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్‌ అందించగా.. ఏఆర్‌ రెహమాన్‌, హన్స్ జిమ్మర్‌ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ను దీపాలి, రాఘవ్‌ కౌశిక్‌ ఆలపించారు.

నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, ‘డీఎన్ఈజీ’, హీరో యశ్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ సంయుక్తంగా సుమారు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రామాయణం చిత్రాన్ని నిర్మించాయి. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, రవి దూబే తదితర స్టార్స్ వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగం 2026 నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ ‘DNEG’ విజువల్ ఎఫెక్ట్స్‌ అందిస్తుండగా ప్రీమియం ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్లలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

 

ఇవి కూడా చదవండి

‘జయ జయ రామ్’ సాంగ్ తెలుగు వెర్షన్ లిరికల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us