Rana Daggubati: ఆయనకు ఉన్న గొప్ప లక్షణం అదే.. పవన్ పై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్

|

Jul 29, 2021 | 8:14 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తోన్న విషయం తెలిసిందే. మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న

Rana Daggubati: ఆయనకు ఉన్న గొప్ప లక్షణం అదే.. పవన్ పై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్
Pawan
Follow us on

Pawan Kalyan-Rana: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తోన్న విషయం తెలిసిందే. మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిసారి పవన్ కళ్యాణ్-రానా కలిసి నటిస్తోన్న సినిమా ఇది. మలయాళంలో బీజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన రిటైర్ట్ హవల్దార్ పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇందులో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. అలాగే పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తోందని టాక్. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా చిన్న బ్రేక్ తీసుకొని ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. తాజాగా ఈ సినిమానుంచి పవన్ లుక్ ను అలాగే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీలో పవన్ భీమ్ల నాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే పవన్‌‌‌తో కలిసి నటించడం పై హీరో రానా మాట్లాడుతూ ఆసక్తిగా విషయాలను పంచుకున్నారు.

రానా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ గారి కాంబినేషన్లో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో కలిసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. ‘ఆయనకు సినిమా పై ఉన్న నమ్మకం, అవగాహన చూస్తే ఆశ్చరుయమేసిందన్నాడు. పాత్ర స్వభావాన్ని త్వరగా పట్టుకోవడం పవన్‌‌కు ఉన్న గొప్ప లక్షణమని చెప్పారు. అనుభవం ఉన్న యాక్టర్స్‌‌తో వర్క్ చేయడం వల్ల ఎన్నో నేర్చుకోవచ్చని చెప్పుకొచ్చాడు రానా. షూటింగ్ గ్యాపులో ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ ఓ మంచి పుస్తకం వంటివారు’ అంటూ చెప్పుకొచ్చాడు రానా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthika Deepam: మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం..కార్తీక్ లో మొదలైన ఆలోచన..అన్నీ సరిచేస్తున్న వంటలక్క!

Ram Gopal Varma : నీకింకా బుద్ధురాలేదా.. హీరో సుమంత్ పై విరుచుకుపడిన వివాదాల వర్మ..

Actor Karthik: ‘సీతాకోకచిలక’ హీరో కార్తీక్‌కు తీవ్ర గాయాలు.. వ్యాయామం చేస్తున్న సమయంలో