Ramya Krishna In Liger Movie : యంగ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా.. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘లైగర్’. ఈ సినిమాను పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనే కాకుండా.. తమిళం,హీందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యింది.
ఈ క్రమంలోనే హీరో విజయ్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్న ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది రమ్యకృష్ణ. “మంచి కంపెనీ ఉంటే పని కూడా పార్టీలానే ఉంటుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది శివగామి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్‌కు తల్లిగా కనిపించనున్నట్లుగా సమాచారం. లైగర్ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో రోనిత్ రాయ్, అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 2019లో ఇస్మార్ట్ శంకర్ విజయం తరువాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read: