Singer Mangli: మంగ్లీ అసలు పేరేంటి.. ఆమె వయస్సు ఎంత.. ఒక్క పాటకు రెమ్యునరేషన్ ఎంత..?

|

Jan 29, 2023 | 10:36 AM

ప్రజంట్ మంగ్లీ సీజన్ నడుస్తుంది. ఆమెది టిపికల్ వాయిస్. ఆమె గాత్రంలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అందుకే ఆమెతో ఒక్క సాంగ్‌ అయినా పాడించాలని మేకర్స్ ఆరాటపడుతున్నారు.

Singer Mangli: మంగ్లీ అసలు పేరేంటి.. ఆమె వయస్సు ఎంత.. ఒక్క పాటకు రెమ్యునరేషన్ ఎంత..?
singer mangli
Follow us on

ప్రజంట్ టాలీవుడ్‌లో స్టార్ సింగర్‌గా దూసుకుపోతుంది మంగ్లీ. ఎంతోకాలంగా ఆమె ఇండస్ట్రీలో ఉన్నప్పటకీ.. పీక్ టైమ్ మాత్రం ఇదే అని చెప్పాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2021లో వచ్చిన లవ్ స్టోరీ మూవీలోని ‘సారంగదరియా’ కంటే ముందు కూడా మంగ్లీ బిజీ సింగర్. కానీ టాప్ ప్లేస్‌కి వెళ్లింది మాత్రం ఈ సాంగ్‌తోనే. మంగ్లీ ఏజ్ 28 సంవత్సరాలు. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. ఆమె సాంప్రదాయ బంజారా వస్త్రధారణ, ఆచారాలు, తెలంగాణ యాసను ప్రమోట్ చేయడం ద్వారా జనాల్లో మంచి పేరు సంపాదించుకుంది. మొదట్లో టెలివిజన్ వ్యాఖ్యతగా రాణించింది మంగ్లీ. ఆపై తెలంగాణ  బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, సమ్మక్క సారక్క జాతర పండుగలను వర్ణించే పాటల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

‘రాములో రాముల’, ‘సారంగదరియా’, ‘జింతక్ చితక్’, ‘ఊరంతా’, ‘బుల్లెట్’, ‘జ్వాలా రెడ్డి’, ‘ఆడ నెమలి’, ‘రా రా రక్కమ్మ’, ‘కన్నె అదిరింది’ వంటి పాటలతో మంగ్లీ ప్రజంట్ దుమ్మురేపుతుంది. ‘ఊ అంటావా ఊ ఊ అంటవా’ పాటను కన్నడ వెర్షన్‌లో పాడింది కూడా మంగ్లీనే. వరుస సూపర్‌హిట్ పాటలతో ఆమె డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో ఒక్కో పాటకు దాదాపు రూ. 20,000 వసూలు చేసిన ఈ లేడీ సింగం.. ఇప్పుడు తన రెమ్యునరేషన్‌తో మేకర్స్ మైండ్ బ్లాంక్ చేస్తుంది.

ఇప్పుడు ఒక్క పాటకు దాదాపు రూ. 2 లక్షలు వసూలు చేస్తుందట మంగ్లీ. మాస్‌రాజా రవితేజ  తాజా కామెడీ యాక్షన్ డ్రామా ధమాకాలోని  ‘జింతక్ చితక్’ పాటం కోసం ఆమె ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుందని ఇండస్ట్రీ టాక్. మంగ్లీ స్వేచ్ఛ, గువ్వా గోరింక, మాస్ట్రో వంటి సినిమాల్లో కూడా నటించింది. ప్రజంట్ ఆమె తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతుంది. రెండు వెబ్ సిరీస్‌లు, ఆధ్యాత్మిక షోలు కూడా చేస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి