Ram Pothineni : రాపోగా అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే రామ్ పోతినేని.. తన 14 ఏళ్ల వయసులోనే…. ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించారు. ఏకంగా ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అదరగొట్టి అందర్నీ ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి హీరో కావాలనుకున్న రామ్ పోతినేని.. తన 14 ఏళ్ల వయసులోనే “అడయాలం” అనే తమిళ షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. నూనూగు మీసాలతో.. క్యూట్గా కనిపించిన రామ్.. డ్రగ్స్‌కు అలవాటు పడిన టీనేజ్ కుర్రాడిగా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకున్నారు.
అంతేకాదు ఈ షార్ట్ ఫిల్మ్‌తో రామ్ నేరుగా యూరోపియన్ మూవీ ఫెస్టివల్ లో అడుగుపెట్టి బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. ఇక ఆ తరువాత వైవీఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాస్‌గా సినిమాతో హీరోగా పరిచయం అయి.. తన ఎనర్జిటిక్ యాక్టింగ్తో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మరారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రెండేళ్లకు రామ్ నుండి ‘రెడ్’ సినిమా వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయినటువంటి రెడ్ మూవీ ఆశించిన స్థాయిలో కాకుండా మోస్తరు విజయం అందుకుంది. కానీ అది రామ్ రేంజి హిట్ కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. రెడ్ మూవీ తర్వాత రామ్ ఆలస్యం చేయకుండా తదుపరి సినిమా లైన్ లో పెట్టేసాడు. రామ్.. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :