Ram Gopal Varma: సర్కార్ కాంబో రిపీట్.. బాలీవుడ్ మెగాస్టార్‌తో ఆర్జీవీ సినిమా !

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సినిమా అంటే ఎదో తెలియని ఆసక్తి అందరిలో నెలకొంటుంది. వివాదాస్పద వాస్తవాలను సినిమా కథలుగా ఎంచుకొని మరీ సినిమాలు చేస్తుంటారు ఆర్జీవీ.

Ram Gopal Varma: సర్కార్ కాంబో రిపీట్.. బాలీవుడ్ మెగాస్టార్‌తో ఆర్జీవీ సినిమా !
Rgv

Updated on: Jun 16, 2022 | 4:38 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సినిమా అంటే ఎదో తెలియని ఆసక్తి అందరిలో నెలకొంటుంది. వివాదాస్పద వాస్తవాలను సినిమా కథలుగా ఎంచుకొని మరీ సినిమాలు చేస్తుంటారు ఆర్జీవీ. ఇప్పటికే తన సినిమాలతో బోలెడంత వివాదాలను వెనకేసుకున్న వర్మ. త్వరలో కొండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఆర్జీవీ తీసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. తెలుగు సినిమాలో శివ సినిమాతో నయా ట్రెండ్ సృష్టించారు ఆర్జీవీ. అలాగే బాలీవుడ్ లో అమితాబ్ తో సర్కార్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే అమితాబ్ ను ఆర్జీవీ సర్కార్ అనే పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా రానుందని తెలుస్తోంది.

వర్మ తెరకెక్కించిన కొండా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మ మాట్లాడుతూ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలీవుడ్ లో ఉండనుందని, అదికూడా ఓ స్టార్ హీరోతో అని క్లారిటీ ఇచ్చారు. దాంతో వర్మ చేసే సినిమా అమితాబ్ తోనే అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. గతంలో బిగ్ బీ తో ఓ హర్రర్ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు ఆర్జీవీ. కానీ ఆతర్వాత దాని గురించి ఊసే లేదు. అయితే ఇప్పుడు ఆర్జీవీ ఆ సినిమా పూర్తి చేయనున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అమితాబ్ కూడా ఆర్జీవీ తో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నారని.. వీలైనంత త్వరగా ఈ సినిమాకు కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా వర్మ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Loading...
Unable to load recommendations.
Follow Us