
The Kashmir Files: దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన సినిమా కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files). చాలా మంది ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పెను సంచలనమే సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలను సినిమాలో కళ్లకు కట్టారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలకపాత్ర పోషించారు. 1990లలో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణలను ఈ సినిమాలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించారు. బాలీవుడ్ కమ్యూనిటికీ చెందిన పలువురు ఇప్పటికే ఈ సినిమాకు అనుకూలంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా బాలీవుడ్ చరిత్రను మార్చేసిందన్నారు ఆర్జీవీ. బాలీవుడ్ టాప్ 7 ప్రొడక్షన్ హౌస్ లు టాప్ లో ఉండటానికి పోటీపడుతూ ఉంటాయి. కానీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు ఎప్పుడు ఎలా వచ్చి టాప్ చైర్ లో కూర్చుంటాయో చెప్పలేం అని ఆర్జీవీ అన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కిల్లర్ విజయం బాలీవుడ్లో ఉన్న అపోహలను చేరిపేసిందని అని వర్మ రాసుకొచ్చారు. ఆ అపోహలు ఏంటంటే..
మరిన్ని ఇక్కడ చదవండి :