HBD Chiranjeevi: మెగాస్టార్‌కు మనవరాలు స్పెషల్ విషెస్.. అందమైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్

|

Aug 22, 2023 | 1:12 PM

నేడు మెగాస్టార్ ఆయన 68వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సినీ నటుడిగా ఆయన ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం.. పునాది రాళ్లు సినిమాతో మొదలైన చిరూ ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతుంది. కుర్రహీరోలకు పోటీ ఇస్తూ ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ బర్త్ డేకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

HBD Chiranjeevi: మెగాస్టార్‌కు మనవరాలు స్పెషల్ విషెస్.. అందమైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్
Chiranjeevi,klin Kaara Koni
Follow us on

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు పురస్కరించుకొని సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు మెగాస్టార్ ఆయన 68వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సినీ నటుడిగా ఆయన ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం.. పునాది రాళ్లు సినిమాతో మొదలైన చిరూ ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతుంది. కుర్రహీరోలకు పోటీ ఇస్తూ ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ బర్త్ డేకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది అంటూ అన్న పై అభిమానినని చాటుకున్నారు పవన్ కళ్యాణ్. ఈమేరకు ఆయన ఓ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అలాగే వెన్నెల కిషోర్, వవరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, తేజ సజ్జ, సత్యదేవ్ ఇలా చాలా మంది మెగాస్టార్ కు విషెస్ తెలిపారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం చిరంజీవికి స్పెషల్ విషెస్ తెలిపారు. దాంతో చిరంజీవి అందంతో తేలిపోతున్నారు. ఇంతకు మెగాస్టార్ కు చరణ్ స్పెషల్ విషెస్ ఎలా చెప్పారో తెలుసా..

మనవరాలి తరపున చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలిపారు రామ్ చరణ్. ప్రియమైన చిరుత ( చిరంజీవి తాత) పుట్టిన రోజు శుభాకాంక్షలు. మా తరపున, మన ఫ్యామిలీలోకి వచ్చిన ఈ చిన్నారి తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో ఓ అందమైన ఫోటోను షేర్ చేశారు రామ్ చరణ్. ఈ ఫొటోలో చిరంజీవి రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురిని ఎత్తుకున్న ఫోటోను పంచుకున్నారు చరణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.