Ram Charan: మారేడుమిల్లి మన్యం అడవుల్లో సందడి చేస్తోన్న రామ్ చరణ్.. కొత్త సినిమా షూటింగ్ లో బిజీబీజీ

ఇప్పటికే రాజమండ్రి చేరుకున్న రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ వారం పాటు సాగే చిన్న షెడ్యూల్‌ అని తెలుస్తోంది. సినిమాలో ప్లాష్ బ్యాక్ సందర్భంగా వచ్చే సన్నివేశాలను ఈ సందర్భంగా చిత్రీకరించనున్నారని సమాచారం.

Ram Charan: మారేడుమిల్లి మన్యం అడవుల్లో సందడి చేస్తోన్న రామ్ చరణ్.. కొత్త సినిమా షూటింగ్ లో బిజీబీజీ
Ram Charan New Moive

Updated on: Oct 11, 2022 | 6:20 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్ సీ 15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆంధప్రదేశ్ లోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ సోమవారం మారేడుమిల్లి రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ఈ  సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే రాజమండ్రి చేరుకున్న రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ వారం పాటు సాగే చిన్న షెడ్యూల్‌ అని తెలుస్తోంది. సినిమాలో ప్లాష్ బ్యాక్ సందర్భంగా వచ్చే సన్నివేశాలను ఈ సందర్భంగా చిత్రీకరించనున్నారని సమాచారం. చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని..  రాజకీయ నేపథ్యమున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమనే టాక్ వినిపిస్తోంది.

Ram Charan New Moive

మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో శంకర్ షూటింగ్ చేసిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అంతేకాదు రామ్ చరణ్ ..రంగస్థలం సినిమాకూడా భారీ హిట్ ను అందుకుంది.. ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. ఇప్పుడు ఆర్ సి 15 సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది.

రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వాని నటిస్తోంది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జె.సూర్య, నవీన్‌చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us