Ram Charan in Leo: దళపతి విజయ్‌ ‘లియో’ సినిమాలో రామ్‌ చరణ్‌.. ఇదిగో ప్రూఫ్ అంటోన్న ఫ్యాన్స్‌..

లియో' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్‌ టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. అయితే అమెరికా వంటి కొన్ని దేశాల్లో టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో రామ్ చరణ్ పేరు కనిపించడం గమనార్హం. సినిమాకు సంబంధించిన నటీనటుల జాబితాలో మెగా పవర్‌ స్టార్‌ పేరు కూడా ఉంది. దీంతో లియో సినిమాలో దళపతి విజయ్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటించి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు

Ram Charan in Leo: దళపతి విజయ్‌ లియో సినిమాలో రామ్‌ చరణ్‌.. ఇదిగో ప్రూఫ్ అంటోన్న ఫ్యాన్స్‌..
Ram Charan, Vijay Thalapathy

Updated on: Oct 11, 2023 | 1:23 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘లియో’ సినిమా విడుదలకు మరికొద్ది రోజులే మిగిలి ఉంది. ఇదే సమయంలో విజయ్‌ సినిమాపై పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా నటించాడు. లోకేశ్ కనగరాజ్ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. పైగా అతని టేకింగ్‌ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఒక సినిమాలోని పాత్రలకు మరో సినిమాకు లింక్ ఉంటుంది. ఇప్పుడు లియో సినిమాలో రామ్ చరణ్ కూడా ఉండనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కూడా ఉంది. ‘లియో’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్‌ టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. అయితే అమెరికా వంటి కొన్ని దేశాల్లో టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో రామ్ చరణ్ పేరు కనిపించడం గమనార్హం. సినిమాకు సంబంధించిన నటీనటుల జాబితాలో మెగా పవర్‌ స్టార్‌ పేరు కూడా ఉంది. దీంతో లియో సినిమాలో దళపతి విజయ్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటించి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఎంతో లావిష్ గా రూపొందిన ‘లియో’ సినిమా ట్రైలర్ లో కొన్ని అంశాలు బాగా హైలెట్ అయ్యాయి. ఇది తమిళ సినిమా అయినప్పటికీ ట్రైలర్‌లో మాత్రం తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన కారు కనిపిస్తుంది. ఈ కారు రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబంధించినదని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే రామ్‌ చరణ్‌ క్యామియో రోల్‌ విషయంపై చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే అది నిజమో కాదో సినిమా విడుదలైన తర్వాతే తెలియాల్సి ఉంది.

అమెరికా సినిమా టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ‘లియో’లో రామ్ చరణ్ పేరును ఉంచడంతోపాటు ట్రైలర్‌లో తెలంగాణకు చెందిన కారు కనిపించడంతో నెటిజన్లు ఈ వాదనను ముందుకు తెస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించాడని వార్తలు వచ్చాయి. అదేంటని దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ని ప్రశ్నించగా.. గోడమీద దీపం పెట్టినట్లు బదులిచ్చారు. దీంతో ప్రేక్షకుల్లో సందేహం మరింత పెరిగింది. సినిమాలోని కొన్ని ఆలోచనలను గోప్యంగా ఉంచి, వాటిని సినిమాలో చూసి ఆనందించాలని దర్శకుడు కోరుకుంటున్నారు. దళపతి విజయ్ నటించిన లియోలో త్రిష, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు నటించారు. సంజయ్ దత్ కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us