RRR Trailer: బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్.. ఎప్పుడంటే..

దర్శకధీరుడు రాజమౌళి... అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం యావత్ దేశవ్యాప్తంగా

RRR Trailer: బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్.. ఎప్పుడంటే..
Rrr

Updated on: Nov 29, 2021 | 4:50 PM

దర్శకధీరుడు రాజమౌళి… అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ కావడంతో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరీస్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన వీరనాటు సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ మధ్య విడుదలైన జననీ పాటకు మంచి రెస్పా్న్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు.

Also Read: Ariyana: రాజ్ తరుణ్ అంటే అస్సలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 5 Telugu Promo: ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్‏లో నామినేషన్స్ హీట్..

Anil Ravipudi: దృశ్యం2 సినిమాను వీక్షించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నారంటే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us