Good Luck Sakhi: రామ్ చరణ్‌తో మహానటి ‘నాటు నాటు’ స్టెప్పులు.. వీడియో వైరల్!

మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో, నటేష్ కుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’గుడ్ లక్ సఖి‘. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 26న హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు

Good Luck Sakhi: రామ్ చరణ్‌తో మహానటి ‘నాటు నాటు’ స్టెప్పులు.. వీడియో వైరల్!
Ram Charan And Keerthy Sure

Updated on: Jan 27, 2022 | 7:29 PM

Ram Charan and Keerthy Suresh dance to Naatu Naatu song: మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో, నటేష్ కుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’గుడ్ లక్ సఖి‘. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 26న హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ రామ్ చరణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. వేడుకలకు హాజరైన రామ్ చరణ్‌ గుడ్ లక్ సఖీ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం RRRలోని పాపులర్ సాంగ్ నాటు నాటుకి కీర్తీ సురేష్‌తో కలిసి స్టెప్పులేశాడు. ప్రస్తుతం వీరి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా మహమ్మారి కారణంగా గుడ్ లక్ సఖి సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఈ చిత్రం జనవరి 28న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ షార్ప్ షూటర్‌గా కనిపించనుంది.

Indian Army Group C Jobs: నెల జీతం రూ. 63,000.. పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు