Raj Tarun: ‘మనసంతా నువ్వే’.. లొల్లి నిజం.. మరి పెళ్లి..? ట్రయాంగిల్ రిలేషన్ కథా చిత్రమ్‌లో అదిరిపోయే ట్విస్ట్..
లొల్లి నిజం.. మరి పెళ్లి?! లావణ్య- రాజ్ తరుణ్ మధ్యలో మాల్వీ మల్హోత్ర... ట్రయాంగిల్ సహజీవన వివాద కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్టలు వెలుగుచూస్తున్నాయి. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు లావణ్య..
హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని నార్సింగ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆ తరువాత కన్పించకపోవడం సంచలనం రేపింది. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో ఆమె తెర ముందుకు వచ్చారు. లావణ్యతో రిలేషన్ షిప్ నిజమే కానీ ఏడేళ్లుగా తమ మధ్య ఎలాంటి సంబంధంలేదన్నారు రాజ్ తరుణ్. డ్రగ్స్ వాడుతూ తనను టార్చర్ చేసేదన్నారు. మాల్వీ మల్హోత్రతో తనకు ఎఫైర్ వుందన్న లావణ్య ఆరోపణలు నిజం కాదన్నారు. అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నారు. అయితే.. రాజ్ తరుణ్ వ్యాఖ్యలకు లేటెస్ట్‌గా కౌంటర్ ఇచ్చారు లావణ్య. తామిద్దరం గుళ్లో పెళ్లి చేసుకున్నామన్నారు. ఇప్పటికీ తాను రాజ్ తరుణ్‌తో కలిసి బతకాలని కోరుకుంటునన్నారు. ఇంత రాద్ధాంతం జరగడానికి మాల్వీనే కారణమన్నారు. మాల్వీతో రాజ్‌కు ఎఫైర్ ఉందన్నారు లావణ్య . మాల్వీ వల్లే రాజ్‌కు తనకు మధ్య విభేదాలు వచ్చాయన్నారు. మాల్వీ ఆమె సోదరుడు తనను చంపేస్తానని బెదరించారన్నారు. వీటిన్నంటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చానన్నారు.
మాల్వీతోనే కాదు మరికొందరితోనూ రాజ్ కు ఎఫైర్స్ ఉన్నాయన్నారు లావణ్య. తమకు పెళ్లయిందనే విషయం వాళ్లలో కొందరికి తెలియదని.. తాను చెప్పాక వాళ్లు సైడయ్యారన్నారు. కానీ ఎంత చెప్పినా మాల్వీ కన్విన్స్ కాకపోగా తనను చంపేస్తానని బెదిరించిందన్నారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ సహా రాజారవీంద్రకు తమ విషయాలన్నీ తెలుసన్నారు లావణ్య. ఇప్పటికీ తన మనసంతా రాజ్ తరుణే అంటూ పేర్కొన్నారు.
కథ ఇందాక వచ్చాక ఇక కన్వీన్స్ అయ్యే ఛాన్సే లేదని క్లియర్ కట్‌గా చెప్పారు రాజ్ తరుణ్.. లీగల్‌గా ఫైట్ చేస్తానన్నారు. అడిగితే సాయం చేస్తేనే తప్ప ఇక అతకడం మాత్రం ఉండదంటూ స్పష్టంచేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..