
“మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మొవ్వా.. తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా” ఈ పాటకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు కుర్రకారుకు పిచ్చెక్కించిన సాంగ్ ఇది. కేవలం ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాదు.. దాదాపు 500 సాంగ్స్ పైగా కంపోజ్ చేసి తనదైన మార్క్ క్రియేట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. కానీ చిన్న వయసులోనే 2014లో గుండెపోటుతో కన్నుమూశారు. కేవలం 40 సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కానీ ఇప్పటికీ చక్రి పాటలు శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. ఇదెలా ఉంటే.. ప్రముఖ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు చక్రి మరణం చుట్టూ అల్లిన పుకార్లపై స్పందించారు. చక్రి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చక్రి మరణానికి గల అసలు కారణాలను వివరిస్తూ, పని ఒత్తిడి, క్రమశిక్షణ లేని జీవనశైలి, నిద్రలేమి అంటూ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్.. ప్రతి ఎపిసోడ్ సీటు అంచున కూర్చోబెట్టాల్సిందే.. ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి..
చక్రి మరణంపై విస్తరించిన “విపరీతంగా తాగి చనిపోయాడు” అనే పుకారు పూర్తిగా అవాస్తవమని రఘు కుంచె ఖండించారు. చక్రి వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి అని, ఎంతోమందికి అన్నం పెట్టిన గొప్ప మనసున్న మనిషి అని అన్నారు. ఆయన కార్యాలయాన్ని “చక్రి సత్రం” అని పిలిచేవారని, రోజుకు 30-50 మంది అక్కడ భోజనం చేసేవారని చెప్పారు. ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా పంపించేవాడు కాదని, ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాడు కాదని ఆయన దాతృత్వాన్ని గుర్తుచేసుకున్నారు. అధిక మద్యం సేవించడం వల్ల చనిపోలేదని, హెల్త్ ఇష్యూస్, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, నిద్రలేమి, అతిగా పని చేయడం, తీవ్రమైన ఒత్తిడి వంటివి ఆయన మరణానికి ప్రధాన కారణాలని రఘు కుంచె స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..
పని ఒత్తిడి, సినిమాలు నిరంతరం చేయడం వల్ల మెదడుపై భారం పడుతుందని, ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వివరించారు. “ఒత్తిడి అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ప్రతిదాన్ని సీరియస్‌గా తీసుకోకండి. స్ట్రెస్ లేకుండా జీవితాన్ని గడపండి” అని ఆయన పిలుపునిచ్చారు. చక్రి చివరి రోజుల్లో శ్వాస సమస్యలతో బాధపడ్డారని, రెండు అడుగులు వేస్తేనే అలసిపోయేవారని, బాడీ ట్రీట్మెంట్‌కు సహకరించని స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంచితనమే ఆయనను పొట్టన పెట్టుకుందని రఘు కుంచె చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..