దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ చిత్రం కోసం కష్టపడిన దర్శకుడు సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి అలాగే చిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు. మూడు సంవత్సరాలుగా మీరు ఈ చిత్రం కోసం పడుతున్న కష్టాన్ని చూస్తూ ఉన్నాం. పుష్ప ది రూల్ సినిమా ఒక అల్లు అర్జున్ గారి సినిమాగా కాకుండా తెలుగు సినిమాగా ప్రపంచవ్యాప్తంగా రూల్ చేయబోతుంది. తప్పకుండా డిసెంబర్ 5న అందరూ థియేటర్లో చూడండి” అన్నారు.
పబ్లిసిటీ అవసరం లేని సినిమా పుష్ప 2. మీ నుంచి ఎప్పటికప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. పుష్ప 2 మరింత హిట్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.
ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన బాహుబలి అనేవారు.. కానీ గత సంవత్సరం నుంచి పుష్ప అంటున్నారు. పుష్ప అనేది ఒక బ్రాండ్. పుష్ప 2 గురించి ఇప్పటికే ఇండియా మొత్తం ప్రీ బుకింగ్స్ చేసేశారు. సుకుమార్ మాస్ కమర్షియల్ సినిమా తీస్తే మాములుగా ఉండదని గతంలో డైరెక్టర్ రాజమౌళి గారు అన్నారు. పుష్ప 2 ప్రపంచం మొత్తం వైల్డ్ ఫైర్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.
పుష్ప 1 ప్రీ రిలీజ్ సమయంలో ఇదే స్టేజ్ పై నిలబడి బన్నీతో అన్నాను. నార్త్ ఇండస్ట్రీని వదలొద్దు అన్నాను. ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ మొత్తం ఇప్పటికే టికెట్స్ కొన్నారని తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఏం మాట్లాడక్కర్లేదు.
హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్లో మాస్ ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. తగ్గదేలే మ్యానరిజంతో స్టేజ్ పై అదరగొట్టారు.
ఇన్నాళ్లు దేశవ్యాప్తంగా జరిగిన ఈవెంట్లలో డైరెక్టర్ సుకుమార్ మిస్సయ్యారు. కానీ తాజాగా యూసఫ్ గూడలో జరుగుతున్న పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ కు డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు.
ఈ మధ్యనే అల్లు అర్జున్ గారితో యాడ్ చేశాను. ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో చూశాను. పుష్ప 2 గురించి నాకు చెప్పిన టిప్ బిట్స్ సినిమా ఎలా ఉంటుందో అన్నారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ..
హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ కు విచ్చేశారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.
పుష్ప 2లో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ అదరగొట్టేసింది శ్రీలీల. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో సందడి చేసింది.
తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లండన్ వీధిల్లో బన్నీకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కొందరు ఫ్యాన్స్ లండన్ వీధుల్లో పుష్ప సినిమాలోని పుష్ప పుష్పరాజ్ హిందీ పాటకు డాన్స్ అదరగొట్టారు. తమ అద్భుతమైన స్టెప్పులతో బన్నీపై బన్నీపై ప్రేమను బయటపెట్టారు.
పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నారు కొరియోగ్రాఫర్ విజయ్ పొల్లకి. డిసెంబర్ 5 థియేటర్లలో పుష్ప 2 అదిరిపోతుందని అన్నారు.
పుష్ప 2 ఫైల్డ్ ఫైర్ ఈవెంట్లో ఫ్యాన్స్ ఎడిట్ చేసిన వీడియోస్ ప్లే చేశారు మేకర్స్. బన్నీ గురించి తెలుగు, కన్నడ, హిందీ భాష నటీనటులు చెప్పిన మాటలను సైతం ప్లై చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పుష్ప2. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప ..ఇప్పుడు హైదరబాద్‌లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ఈవెంట్ నిర్వహిస్తుంది..
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 డిసెంబర్ 5న రిలీజ్‌కి రెడీ అవుతోంది. 3. 20 నిమిషాల 38 సెకన్లు నిడివి ఉన్నట్టు సమాచారం. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఇకపై ఇంతింత గ్యాప్ తీసుకోను.. నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తూనే ఉంటాను అని కేరళ వేదికగా బన్నీ చెప్పేశారు. ఇప్పటి వరకూ ఉన్న రికార్డులన్నిటినీ పుష్ప2 సరికొత్తగా రాస్తుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది బన్నీలో. సినిమా ఎక్కడా డిస్పాయింట్ చేయదని పదే పదే చెబుతున్నారు రష్మిక.
ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. సెకండాఫ్‌లో యాక్షన్ పీక్స్ లో ఉంటుంది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే మూడు యాక్షన్ సీక్వెన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలైతే ఎవరి ఊహకూ అందనంత భారీగా ఉంటాయి. నెవర్ బిఫోర్ అనేలా మెప్పిస్తాయన్నది ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తున్న మాట.
పుష్ప 2 ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డ్ ఖాతాలో వేసుకుంది. 24 గంటల్లో లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డ్స్ సృష్టించిన స్త్రీ 2, డంకీ, యానిమల్, టైగర్ సినిమాలను పుష్ప 2 మూవీ అధిగమించింది.
ప్రస్తుతం యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి పుష్ప 2 సాంగ్స్. పుష్ప పుష్పరాజ్ సాంగ్ నుంచి మొన్న విడుదలైన పీలింగ్ సాంగ్ వరకు ప్రతి పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. గతంలో పుష్ప ది రైజ్ చిత్రంలో సామీ సామీ పాటను ఫోక్ సింగర్ మౌనికతో పాడించగా.. ఇప్పుడు పీలింగ్స్ పాటను ఫోక్ సింగర్ లక్ష్మీతో పాడించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.
పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర మొదలైంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో అల్లు అర్జున్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో అల్లు అర్జున్, రష్మిక మందన్నాతోపాటు చిత్రయూనిట్ సభ్యులు హాజరుకానున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మేనియా కనిపిస్తుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది పుష్ప 2. అమెరికన్ బాక్సాఫీస్ లో అత్యంత వేగంగా టికెట్స్ ప్రీసేల్ ద్వారానే 1 మిలియన్ డాలర్ల మార్కును చేరింది ఈ మూవీ.
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ నిర్వహించేందుకు అన్ని పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే వేదిక వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప 2 ఫీవర్ కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుండడంతో ప్రమోషన్స్ సైతం అదే రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబైలలో ఈ మూవీ ఈవెంట్స్ గ్రాండ్ గా జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్ లో పుష్ప 2 ఈవెంట్ నిర్వహించనున్నారు. పుష్ప 2 వైల్డ్ ఫైర్ పేరుతో యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అలాగే దాదాపు 100 మంది పోలీసులు ఈ వేడుకకు బందోబస్త్ చేస్తున్నట్లు సమాచారం. ఈవెంట్ చుట్టుపక్కల ప్రదేశాలు అన్ని పోలీసు కనుసన్నల్లోనే ఉన్నాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగుకుండా ఉండేందుకు.. అలాగే భారీగా తరలివస్తున్న ఫ్యాన్స్ క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.