418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా '418'. దీనికి తోడు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, పోస్టర్స్ హైప్ క్రియేట్ చేస్తుండగా... తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు
418 Movie

Updated on: Jul 19, 2026 | 9:20 PM

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక హారర్ థ్రిల్లర్ ‘418’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘418’, హారర్ త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా సరికొత్త హారర్ అనుభూతిని అందించబోతోంది.పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, విడుదలకు మరో రెండు వారాల సమయం ఉండడంతో త్వరలోనే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ చిత్రానికి దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా, వెంకీ జీజీ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. ఉల్లాస్ హైడూర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, త్వరలోనే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

జులై 31న గ్రాండ్ రిలీజ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us