
సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల షూటింగ్ సెట్లో గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్లో పాల్గోన్న ప్రకాష్ రాజ్..సెట్లో గాయపడ్డారు. దీంతో ఆయన చేతికి ఫ్యాక్చర్ అయినట్లుగా ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు ప్రకాష్ రాజు. సర్జరీ కోసం హైదరాబాద్‌లోని తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి దగ్గరకు వస్తున్నానని.. తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు ప్రకాష్ రాజ్.
ది డెవిల్ ఈజ్ బ్యాక్.. సర్జరీ విజయవంతం అయ్యింది. నా స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డికి.. నాకోసం ప్రార్ధించిన ధన్యవాదాలు.. తొందర్లోనే యాక్టింగ్ చేస్తా అంటూ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అందులో హాస్పిటల్ బెడ్ పై నుంచి సెల్ఫీ తీసుకున్న ఫోటోను ప్రకాష్ రాజు షేర్ చేశారు. అందులో ఆయన ఎడమ చేతి భూజంపై గాయమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది.
ట్వీట్..
ప్రకాష్ రాజ్ ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. రూమర్స్‌కు చెక్ పెట్టినట్టేనా ?