Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. రెబల్ స్టార్ రాధేశ్యామ్ రీషూట్… కారణం అదేనా

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాస్త లేటైనా ప్రభాస్ నుంచి వరుస సినిమాలతో రాబోతున్నాడని అభిమానులంతా..

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. రెబల్ స్టార్ రాధేశ్యామ్ రీషూట్... కారణం అదేనా

Updated on: May 21, 2021 | 2:59 PM

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాస్త లేటైనా ప్రభాస్ నుంచి వరుస సినిమాలతో రాబోతున్నాడని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్’ .. ‘సలార్’ .. ‘ఆది పురుష్’ తరువాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. వీటిలో ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. అలాగే సలార్  సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఆదిపురుష్ త్వరలోనే మొదలవనుంది. ఎటు తిరిగి నాగ్ అశ్విన్ సిన్ సినిమానే కాస్త ఆలస్యం అవ్వనుంది. కరోనా కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ప్రాజెక్టు లేట్ అవుతున్నందుకు నాగ్ అశ్విన్ అసంతృప్తికి లోనుకావడం లేదట. స్క్రిప్ట్ పై మరింత శ్రద్ధ పెట్టి, ఒక రేంజ్ లో కసరత్తు చేస్తున్నాడట.  ఇక రాధేశ్యామ్ సినిమా కు సంబంధించి రోజుకొక వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

తాజాగా అలాంటి వార్తే ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 80వ దశకం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చాలా వరకు సెట్స్ లో షూట్ చేశారు. మిగిలిన పార్టు కోసం సీజీ వర్క్ ను ఆశ్రయించారు. ఈ వర్క్ ను విదేశీ కంపెనీలకు అప్పగించడం.. అక్కడ కరోనా ఇబ్బందులు రావడంతో మరింత ఆలస్యం అవుతుందంట. దాంతో ఈ సమయంలోనే రీ-షూట్ కు సైతం వెళ్లారని టాక్. వాస్తవానికి ఓ పాట యాడ్ చేయాల్సి ఉంది. కొన్ని సీన్లు రీషూట్ చేస్తే బాగుంటుందని చిత్రయూనిట్ అనుకుంటున్నారని ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

sonu sood: పాన్ ఇండియా మూవీలో హీరోగా సోనూసూద్.. డైరెక్ట్ చేయబోతున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్…

Trisha Krishnan: చెన్నై చంద్రం త్రిష పై గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే.

 

Loading...
Unable to load recommendations.
Follow Us