
అందాల భామ రిచా గంగోపాధ్యాయ్ 1986 మార్చి 20న న్యూఢిల్లీలో జన్మించింది. అయితే రిచా మొత్తం విద్యాభ్యాసం అమెరికాలో పూర్తి చేసింది.

అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన ఈ బ్యూటీ. 2007లో అక్కడే 'మిస్ ఇండియా యూఎస్‌ఏ'గా నిలిచింది.

ఇక రిచా 2010 రానా హీరోగా తెరకెక్కిన 'లీడర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాలోనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది.

రవితేజ సరసన 'మిరపకాయ్', 'సారొచ్చారు' చిత్రాల్లో కనిపించి తన నటనతో మెస్మరైజ్ చేసింది.

ఇక 2013లో ప్రభాస్ సరసన 'మిర్చి' సినిమాలో నటించి సూపర్ హిట్‌ను అందుకుంది.

చివరిగా నాగార్జున హీరోగా తెరకెక్కిన 'భాయ్' సినిమాలో నటించిన తర్వాత రిచా మళ్లీ వెండితెరపై కనిపించలేదు.

సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రిచా అమెరికా తిరిగి వెళ్లి.. కొన్నాళ్ల తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది.

ఈ క్రమంలోనే అమెరికాలో తన చిన్న నాటి స్నేహితుడు జోలాంగేల్లాను వివాహం చేసుకుంది. దీంతో రిచా గంగోధ్యాయ్ కాస్త.. రిచా లాంగేల్లాగా మారింది.

రిచా ప్రస్తుతం ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుందీ బ్యూటీ.

మరి రిచాకు మనం కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా... 'హ్యాపీ బర్త్ డే రిచా..!'