
పూనమ్ కౌర్.. ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో అలరించిన నటి. ప్రస్తుతం నెట్టింట ఓ హాట్ టాపిక్. ఆమె ఏ ట్వీట్ చేసినా, పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ‘మాయాజాలం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్.. తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నాగవల్లి, గగనం, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది. ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవడంతో.. కేరెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ఆ సినిమాలు కూడా మంచి పేరు తీసుకురాకవపోడంతో.. ఇండస్ట్రీ నుంచి కొంతకాలంగా దూరంగా ఉంటుంది. అయితే సోషల్‌మీడియాలో వివాదాస్పద ట్వీట్లతో తరచూ వార్తల్లోకి వస్తుంటుంది. తాజాగా అగ్ర హీరో నందమూరి బాలకృష్ణపై పూనమ్ చేసిన ట్వీట్ మరోసారి చర్చకు దారితీసింది.
🫶 ballaya – as I always said child like energy – god makes people instrument for a purpose which is revealed with time 😇. https://t.co/b0VufEUBw8
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2025
“బాలయ్య చిన్న పిల్లాడిలా ఎనర్జీతో ఉంటారని నేను ఎప్పుడూ చెబుతుంటాను. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు. అది టైంను బట్టి బయటపడుతుంది” అంటూ గతంలో బాలకృష్ణ గురించి వేసిన ఓ పోస్ట్‌ను రీ పోస్ట్ చేసింది.
గతంలో ఓ వేడుకలో ‘సమర సింహారెడ్డి’ చిత్రంలోని “నందమూరి నాయకా అందమైన కానుకా ముందరుంది చూసుకోరా” అనే సాంగ్‌కి తాను డ్యాన్స్ వేస్తుంటే.. బాలకృష్ణ కేరింతలు కొడుతూ చూసే వీడియోను 2024, సెప్టెంబర్ 1న ట్వీట్ చేసింది. ఆ సమయంలో ఆమె బాలయ్యపై పొగడ్తల వర్షం కురిపించింది.
“బాలయ్య మహా వృక్షం లాంటి వారు. అది అన్ని వేళలా మనుషులు, జంతువులకు నీడనిస్తుంటుంది. ఆదిత్య 369 నుంచి భగవంత్ కేసరి వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఎనర్జీతో కనిపిస్తారు. అది ఆయనకు భగవంతుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదం” అని పేర్కొంది. తమ హీరో ప్రశంశిస్తూ నటీమణి వేసిన పోస్ట్‌పై బాలయ్య అభిమానులు ఓ రేంజ్‌లో పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..