Pooja Hegde : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ.. ఏం చేసిందో తెలుసా..

|

May 23, 2021 | 9:09 PM

పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ దారిలో నడుస్తున్నారు.. మరాఠీ బ్యూటీ పూజా హెగ్డే. ఇండస్ట్రీలో తనకిష్టమైన వాళ్లందిరికీ పవన్‌లానే ఓ స్పెషల్ బాక్స్‌ను పంపిస్తూ..

Pooja Hegde : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ.. ఏం చేసిందో తెలుసా..
Follow us on

Pooja Hegde : పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ దారిలో నడుస్తున్నారు.. మరాఠీ బ్యూటీ పూజా హెగ్డే. ఇండస్ట్రీలో తనకిష్టమైన వాళ్లందిరికీ పవన్‌లానే ఓ స్పెషల్ బాక్స్‌ను పంపిస్తూ.. అందర్నీ తియ్యగా సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ తియ్యని సర్‌ప్రైజ్‌ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..!ఇండస్ట్రీలో తనకిష్టమైన వారందరికీ మామిడి పండ్లను పంపుతున్నారు.. పూజా హెగ్డే. మంగుళూరులోని తన ఫ్రెండ్‌ తోటలో.. సేంద్రీయ ఎరువులతో పండిన.. ఫస్ట్ క్లాస్‌ మామిడి పండ్లను.. ఓ బాక్స్‌లో ప్యాక్‌ చేసి పంపుతున్నారు.ఇప్పటికే ఈ బ్యూటీ పంపిన మామిడి పండ్లను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అందుకోగా .. ఇప్పుడు డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ వంతు వచ్చింది. అవును రీసెంట్గా పూజా పంపిన మామిడి పండ్లు హరిష్ శంకర్ అందుకున్నారు. అందుకోవడమే కాదు ఈ స్వీట్ గెస్చర్‌కు థాంక్యూ అంటూ.. పూజా పంపిన మామిడి పండ్లను.. ఆమె రాసిన లెటర్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

ఇక పూజా రాసిన ఆ లెటర్‌లో “హలో సర్! నా ఫ్రెండ్‌ తోటలో పండించిన ఈ రుచికరమైన, సేంద్రీయ మామిడి పండ్లను మీరు ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. ఇక మనం త్వరలో కలుద్దాం!! లవ్, పూజా హెగ్డే” అంటూ రాసుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్లు పవన్‌ను మక్కీకి మక్కీ ఫాలో అవుతున్నావ్‌ పూజా.. అంటూ కమెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

S. Thaman: గోపీచంద్ మలినేని సినిమాకు సంగీతదర్శకుడు ఫిక్స్.. బాలయ్య సినిమాకు బద్దలయ్యే మ్యూజిక్ ఇవ్వనున్న తమన్..

The Family Man 2 controversy: ఫామిలీ మ్యాన్ – 2 సరికొత్త కష్టాలు.. వెబ్ సిరీస్ రద్దు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ..

Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆకాశానికెత్తేసిన రంగమ్మత్త.. ఆయన అంకితభావం కలిగి ఉన్న స్టార్ అంటూ..