కృష్ణ అండ్ హిజ్ లీల: ఓవ‌ర్ డోస్ రొమాన్స్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

|

Jun 28, 2020 | 3:48 PM

ఈ మ‌ధ్య ఏ సినిమా రిలీజ్ అయినా చాలు..అందులో ఉన్న ఏదో ఒక కంటెంట్ విష‌యంలో స‌మాజంలోని ఏదో ఒక వ‌ర్గ మ‌నోభావాలు దెబ్బ‌తింటాయి. దీంతో వారు రోడ్డుపైకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెల‌ప‌డం.

కృష్ణ అండ్ హిజ్ లీల: ఓవ‌ర్ డోస్ రొమాన్స్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
Follow us on

ఈ మ‌ధ్య ఏ సినిమా రిలీజ్ అయినా చాలు..అందులో ఉన్న ఏదో ఒక కంటెంట్ విష‌యంలో స‌మాజంలోని ఏదో ఒక వ‌ర్గ మ‌నోభావాలు దెబ్బ‌తింటాయి. దీంతో వారు రోడ్డుపైకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెల‌ప‌డం. కేసులు పెట్ట‌డం, కోర్టుల‌కు వెళ్ల‌డం కామ‌న్ అయిపోయింది. తాజాగా అదే ఎఫెక్ట్ ఇటీవ‌లే ఓటీటీలో రిలీజైన‌ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాపై ప‌డింది. ఓ వ్య‌క్తి సినిమా స్ట్రీమింగ్ ఆపాలంటూ .. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు కూడా.

గుంటూరు టాకీస్, గరుడవేగ సినిమాలతో ప్రాచూర్యం పొందిన‌ సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా తెర‌కెక్కింది. రానా ద‌గ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. మరో ఇద్దరు భామ‌లు సీరత్ కపూర్, షాలిని వాడ్నికట్టి లీడ్ రోల్స్ లో క‌నిపించారు. గురువారం ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే తాజాగా సినిమాపై వివాదం ముసురుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

‘కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రంలో‌ హీరోహీరోయిన్ల పాత్రలకు హిందూ దేవుళ్ల పేర్లు పెట్టడమే కాకుండా అధికంగా రొమాన్స్ సన్నివేశాలను పెట్టారని రాకేష్ అనే వ్య‌క్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తూ మూవీని వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశాడు.