మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఈసారి పవన్ కోసం భారీ స్కెచ్.. సరికొత్త పాత్రలో కనిపించనున్న పవర్ స్టార్ ?

|

May 21, 2021 | 7:19 PM

గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో.. మరో మూవీ వస్తుంది. ఇప్పుడా సినిమా నుంచి ఓ బిగ్గెస్ట్ బజ్ రివీల్ అయ్యింది. గబ్బర్ సింగ్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో

మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఈసారి పవన్ కోసం భారీ స్కెచ్.. సరికొత్త పాత్రలో కనిపించనున్న పవర్ స్టార్ ?
Pawan Kalyan
Follow us on

గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో.. మరో మూవీ వస్తుంది. ఇప్పుడా సినిమా నుంచి ఓ బిగ్గెస్ట్ బజ్ రివీల్ అయ్యింది. గబ్బర్ సింగ్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించినట్లే.. ఈ సారి డైరెక్టర్ హరీశ్ శంకర్.. పవన్ ను మరో ఎనర్జిటిక్ రోల్ లో చూపించబోతున్నాడట. తన స్పీచ్ తో.. చాలామందిని ప్రభావితం చేసేలా క్యారెక్టర్ లా డిజైన్ చేస్తున్నాడట.

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం.. పవన్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా గబ్బర్ సింగ్. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇదే కాంబినేషన్ లో మరో మూవీ వస్తున్నట్లు.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తెలిపాడు. తన మ్యూజిక్ డైరెక్షన్ లో ఇప్పటికే రెండు ట్యూన్స్ కూడా రెడీ అయ్యాయని కూడా ప్రకటించారు. అయితే ఈ కొత్త మూవీలో పవన్ క్యారెక్టర్ ను డిజైన్ చేసే పనిలో పడ్డాడు.. డైరెక్టర్ హరీశ్ శంకర్. కాలేజీ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో సాగే కథలో.. పవన్ పవర్ ఫుల్ లెక్చరర్ పాత్రలో నటిస్తాడట. ఇందుకోసం పెద్ద ఎత్తున కాలేజ్ సెట్ ను కూడా వేయాలని ప్లాన్ చేస్తున్నారట. వకీల్ సాబ్ సినిమాలో పవన్ పంచ్ డైలాగ్స్ ఎలా ఉన్నాయో.. అలాగే లెక్చరర్ గా పవన్ ఇచ్చే స్పీచ్ లు ఈ చిత్రంలో కీలకం అని చెబుతున్నారు. పవన్ ప్రసంగాలకు స్టూడెంట్స్ ప్రభావితం అయ్యే కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ కావడంతో.. డైలాగ్స్ కోసం పవర్ ఫుల్ రైటర్ ను తీసుకుంటున్నారట. హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీస్ చేస్తున్న పవన్.. ఆ గ్యాప్ లోనే హరీశ్ శంకర్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చేలా డేట్స్ సర్దుబాటు చేస్తున్నారని.. టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Also Read: బీపీని తగ్గించుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందే.. బ్లడ్ ప్రెషర్ నియంత్రణ ఇలా..

International Tea Day 2021: అంతర్జాతీయ టీ దినోత్సవం.. ఒత్తిడిని, నొప్పుల్ని తగ్గించే ఇలాచి టీతో ఎన్నో ప్రయోజనాలు..