Prabhas: మహేష్ , అల్లు అర్జున్ బాటలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

|

Jul 15, 2022 | 8:00 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Prabhas: మహేష్ , అల్లు అర్జున్ బాటలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
Prabhas
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas:) రీసెంట్ గా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ అభిమానులను నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ నెక్స్ట్ సినిమా సలార్ పైనే ఆశాలు పెట్టుకున్నారు. కేవలం తెలుగు దర్శకులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం డార్లింగ్‏తో మూవీస్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఇవే కాకుండా సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నాడు ప్రభాస్.

ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు ఓ కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టనున్నడని తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో బడా హీరోలు మహేష్ బాబు , అల్లు అర్జున్  , రామ్ చరణ్ పలు బిజినెస్ లలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఇదే బాటలో ప్రభాస్ కూడా ఓ బిజినెస్ ను మొదలు పెట్టనున్నాడట. ప్రభాస్ భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే. దాంతో ఆయన రెస్టారెంట్స్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. స్పెయిన్ దుబాయిల్లో హోటళ్లు నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభాస్ టీమ్ రంగంలోకి దిగిందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి