
రణబాలి వంటి సూపర్ హిట్ తర్వాత రష్మిక మందన్నా నటిస్తోన్న సినిమా ‘మైసా’ లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే అతనికి మొదటి సినిమా కావడం గమనార్హం. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో సరికొత్త అవతారంలో కనిపించనుంది. గిరిజన గోండు మహిళ పాత్రలో ఆమె పవర్‌ఫుల్ రోల్ పోషించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పవర్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన సూపర్ హిట్ సినిమా ఒసేయ్ రాములమ్మ. ఇందులోని టైటిల్ సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ చాలా చోట్ల ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో రష్మిక మైసా సినిమా కోసం ‘ఒసేయ్ రాములమ్మ’ని రీమిక్స్ చేశారు. తాజాగా ఆ గీతాన్ని ఇప్పుడు రిలీజ్ చేశారు. మైసా సినిమా కోసం రాములమ్మ పాటలోని కొన్ని లిరిక్స్ మార్చి రీక్రియేట్ చేశారు. కేవలం పల్లవిని వాడుకొని, చరణంలో బలమైన పదాలను వాడుతూ ఈ పాటని రాశారు ప్రముఖ రైటర్ సుద్దాల అశోక్ తేజ. ఈ పాటని వందేమాతరం శ్రీనివాస్ ఆలపించడం విశేషం. జేక్స్ బిజోయ్ ఈ పాటకు ట్యూన్ అందించారు.
కాగా ఈ పాటలో రష్మిక మందన్న ఇప్పటివరకు ఎన్నడూ చూడని అత్యంత మాస్ అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించింది.
అడవి నేపథ్యంలో, రక్తసిక్తమైన పోరాట సన్నివేశాలు, గొలుసులు, ఆయుధాలతో రష్మిక చేసే ఫైట్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. నీటిలో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మొత్తానికి ఈ ఒసేయ్ రాములమ్మ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మైసా సినిమా విషయానికి వస్తే.. అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ సైపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మికతో పాటు సముద్ర ఖని, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.