Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై సినిమా .. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్..

పహల్గాం ఘటనకు ప్రతీకారణంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశ సరిహద్దు ప్రాంతాల్లోని అమాయక ప్రజల నివాసాలపై పాక్ దాడులకు పాల్పడుతుంది. భారత ఆర్మీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటుంది.

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై సినిమా .. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్..
Operation Sindoor Movie

Updated on: May 10, 2025 | 1:29 PM

గత రెండు మూడు రోజులుగా భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పహాల్గామ్ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసింది భారత్. దీంతో గత రెండు రోజులుగా జమ్మూ కశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. భారత ఆర్మీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ఉత్తమ్ నితిన్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకుని నుదుటన సింధూరం పెట్టుకుంటున్న మహిళను చూపించారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో ఫైటర్ జెట్ లను మండుతున్న యుద్ధ భూమిని చూపారు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలను, పహల్గాం ఘటనను ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే.. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమయం, సందర్భం లేకుండా టైటిల్ , పోస్టర్ రివీల్ చేయడంపై నెటిజన్స్ విమర్శించారు. దీంతో డైరెక్టర్ క్షమాపణలు చెబుతూ స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. “ఆపరేషన్ సింధూర్ పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇతరుల మనోభావాలను గాయపర్చడం లేదా రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు.. మన సైనికుల ధైర్య సాహాసాలను, త్యాగాన్ని, నాయకత్వాన్ని పవర్ ఫుల్ కథగా వెండితెరపైకి తీసుకురావాలనుకున్నాను. దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తూ ఈ సినిమాను తీయాలనుకున్నాను. అంతేకానీ డబ్బు, ఫేమ్ కోసం కాదు. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఇది సినిమా కాదు.. దేశ ప్రజల ఎమోషన్” అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

Loading...
Unable to load recommendations.
Follow Us