Natu Natu Song: చరణ్, తారక్‌లతో 17 టేక్స్ చేయించిన జక్కన్న.. ఎన్నవది ఓకే చేశారో తెల్సా..?

|

Jan 11, 2023 | 2:42 PM

నాటు నాటు సాంగ్‌కు చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా..ప్రేమ్‌ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటను ఆలపించారు. ఐతే తాము ఎంత కష్టపడి రాసినా..పాటలోని భావం అర్థం చేసుకునేవారు ఉండాలన్నారు చంద్రబోస్‌. ఇవాళ అదే జరిగిందని..నాటునాటు సాంగ్‌లోని భావాన్ని అర్థం చేసుకొని పట్టం కట్టారన్నారు.

Natu Natu Song: చరణ్, తారక్‌లతో 17 టేక్స్ చేయించిన జక్కన్న.. ఎన్నవది ఓకే చేశారో తెల్సా..?
NTR-Ramcharan’s ‘Naatu Naatu’ song
Follow us on

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ చరిత్ర సృష్టించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో..నాటు నాటు సాంగ్‌ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ అవార్డ్‌ దక్కించుకుంది. ఈ కేటగిరీలో ఏషియా నుంచి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌ అందుకున్న తొలి మూవీగా నిలిచింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి..అతిరథ మహారథుల మధ్య గోల్డెన్‌ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో నాటు నాటు సాంగ్‌ టఫ్ ఫైట్‌ ఎదుర్కొంది. వేర్ ద క్రావ్‌డడ్స్ నుంచి టేలర్‌ స్విఫ్ట్స్‌ కరోలినా..గైల్లెర్మో డెల్ టోరోస్ పినాకియో నుంచి సియావో పాపా..టాప్ గన్ మావెరిక్ నుంచి హోల్డ్ మై హ్యాండ్, బ్లాక్ పాంథర్ వకండా ఫరెవర్ నుంచి లిఫ్ట్ మీ అప్ వంటి సాంగ్స్‌ నాటు నాటుకు గట్టి పోటీనిచ్చాయి. ఐతే చివరకు నాటు నాటు పాట అవార్డ్‌ దక్కించుకుంది.

ఇక ‘నాటు నాటు’ పాటకు అవార్డ్‌ ప్రకటించిన వెంటనే వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అందరూ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌ వేదిక నాటు నాటు సాంగ్‌తో దద్దరిల్లిపోయింది. అమెరికన్లు సైతం ఈ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేశారు.  RRR మూవీలోని నాటు నాటు సాంగ్ ​సంచలనం సృష్టించింది. ఈ సాంగ్‌తో వీర నాటు, ఊర నాటు స్టెప్పు లేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల్ని ఊర్రూతలూగించారు యంగ్ టైగర్​ ఎన్టీఆర్, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్. విదేశీయలు చేత కూడా ఈ పాటకు స్టెప్పులేయించేలా చేశారు.

 80కి పైగా వేరియేషన్‌ స్టెప్స్‌

‘నాటు నాటు’లో హుక్‌ స్టెప్‌ కోసం 80కి పైగా వేరియేషన్‌ స్టెప్స్‌ను డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్‌ రక్షిత్‌ టీమ్ రికార్డు చేసిందట. చివరకు ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని ఇద్దరూ ఒకే రకంగా కాళ్లు కదిపే స్టెప్‌ను ఫైనల్ చేశారు. షూటింగ్ సమయంలో ఈ స్టెప్‌ కోసం చరణ్, తారక్‌లతో 17 టేక్‌లు చేయించారట డైరెక్టర్ రాజమౌళి. కానీ సింక్ బాగా కుదరడంతో 2వ టేక్ ఓకే చేశారట. చిన్న మూమెంట్ కూడా ముందు, వెనక అవ్వకుండా ఒక రాక్షసుడిలా తమతో జక్కన్న ఈ పాట చేయించారని తారక్, చరణ్ ఓ ఇంటర్య్యూలో చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌లో తోపు డ్యాన్సర్స్ అని చరణ్, తారక్‌లకు పేరుంది. అలాంటి వాళ్లతోనే 17 టేక్‌లు చేయించారంటే… దర్శకుడు రాజమౌళి ఈ పాటపై ఎంత ప్రాణం పెట్టారో అర్థం చేసుకోవచ్చు.

ఎం.ఎం.కీరవాణి ట్యూన్ అందించగా చంద్రబోస్‌ ఈ పాటకు అదిరిపోయే సాహిత్యం అందించారు. ఇక రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవలు తమ గాత్రాలతో పాటను  నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. ఈ పాటను ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.