Faria Abdullah: మల్టీ టాలెంటెడ్ బ్యూటీ.. జాతిరత్నాలు చిట్టి మాములు కుట్టి కాదుగా..!

నవీన్ పోలీశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఫారియా అబ్దుల్లా.

Faria Abdullah: మల్టీ టాలెంటెడ్ బ్యూటీ.. జాతిరత్నాలు చిట్టి మాములు కుట్టి కాదుగా..!
Faria Abdullah

Updated on: Jun 19, 2022 | 4:00 PM

నవీన్ పోలీశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఫారియా అబ్దుల్లా(Faria Abdullah). ఈ హైదరాబాద్ అమ్మాయి తన క్యూట్ నెస్ తో కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టేసింది. చిట్టి పాత్రలో ఫారియా నటన.. అమాయకత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. అలాగే నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి అదరగొట్టింది. ఇక ఈ అమ్మడు తన డాన్స్ టాలెంట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. అయితే ఫారియాలో చాలా టాలెంట్ ఉంది. ఈ అమ్మడు మల్టీ టాలెంట్.

ఫారియా అబ్దుల్లా చిన్ననాటి నుంచే  పెయింటింగ్ అలాగే డాన్స్ ఇలా విభిన్నమైన కళలలో ప్రావిణ్యం పొందిందట. అలాగే పెయింటింగ్ క్లాసుల కోసం హైదరాబాద్ లోని కాచిగూడ వెళ్లి నేర్చుకుందట.. అదేవిధంగా లిటరేచర్ క్లాసుల కోసం లింగంపల్లి వెళ్లేదట. ఇక సినిమాల పై ఆసక్తి పెంచుకుంది. ‘నిషుంబిత’ ‘సమహార’ లాంటి గ్రూప్స్తో కలిసి పనిచేసిందట. అలాగే రచన , డైరెక్షన్ కూడాచేసేడట.  కాలేజ్ లో పలు నాటకాలు, చిన్న చిన్న స్కిట్స్ రాయడమే కాకుండా డైరెక్షన్ కూడా చేసిందట. అలాగే కాలేజ్ ఫంక్షన్స్ లో తన డాన్స్ తో అదరగొట్టేదట. అలాగే ఓ ప్రోగ్రాంలో డాన్స్ చేసే సమయంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమెను చూసి జాతిరత్నాలు సినిమాకు ఎంపిక చేశారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us