Niharika Konidela : గులాబీ దుస్తుల్లో గుభాళించిన సోయగం.. నిహారిక ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఆమె సినిమారంగంలోకి అడుగు పెట్టారు. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేసిన నిహారిక ఆతర్వాత నాగశౌర్య నటించిన ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా మారారు.

Niharika Konidela : గులాబీ దుస్తుల్లో గుభాళించిన సోయగం.. నిహారిక ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు
Niharika Konidela

Edited By: Team Veegam

Updated on: Apr 22, 2021 | 12:55 PM

Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఆమె సినిమారంగంలోకి అడుగు పెట్టారు. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేసిన నిహారిక ఆతర్వాత నాగశౌర్య నటించిన ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా మారారు. ఆతర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోయారు. మెగాస్టార్ నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాలో చిన్నపాత్రలో మెరిశారు నిహారిక.

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే. నిహారిక వివాహం గుంటూరు రేంజ్ ఐటీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు, వ్యాపారవేత్త వెంకట చైతన్యతో ఘనంగా జరిగింది. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాతో అభిమానులకు ఎక్కువ చేరువగా ఉంటుంది నిహారిక. తనవ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది నిహారిక. తన భర్తతో గడిపిన మధురమైన క్షణాలను ఫొటోల రూపంలో పంచుకుంటుంది నిహారిక. పెళ్లి తర్వాత కూడా నిహారిక తన గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో గులాబీల గుభాళించింది నిహారిక. ఈ ఫోటోలకు గులాబీ దుస్తులు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలపై మీరు ఒక లుక్కేయండి.

Read also:  నెట్ ఫ్లిక్స్‏లో ‘వైల్డ్ డాగ్’… విడుదలైన 19 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నాగ్ మూవీ..

జోరు పెంచిన పవర్ స్టార్ .. మరో సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

యంగ్ హీరో రామ్ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయిన్