AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: బంగారం రా మా లేడీ పవర్ స్టార్.. ఇంత మంచితనమేంటమ్మా.. సాయి పల్లవిపై నెటిజన్స్ ప్రశంసలు..

డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి, చైతూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సాయిపల్లవి మంచి మనసుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు

Sai Pallavi: బంగారం రా మా లేడీ పవర్ స్టార్.. ఇంత మంచితనమేంటమ్మా.. సాయి పల్లవిపై నెటిజన్స్ ప్రశంసలు..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2024 | 12:01 PM

Share

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమనే చెప్పాలి. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో సినీరంగ ప్రవేశం చేసి మలర్ పాత్రలో ఒదిగిపోయింది. తొలి సినిమాతోనే అటు మలయాళీ సినీ ప్రియులను.. ఇటు తెలుగు, తమిళ్ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అందం, అభినయంతో టాలీవుడ్ కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఫిదా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తామంటూ నిర్మాతలు ఆఫర్స్ ఇచ్చారు. అయినా కంటెంట్ నచ్చి.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తానని తేల్చీ చెప్పింది. దీంతో ప్రేక్షకులలో ఆమె స్థానం మరింత అగ్రస్థానానికి తీసుకెళ్లాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది సాయి పల్లవి. మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ఇప్పుడు ఆమె తండేల్ చిత్రంలో నటిస్తుంది.

డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి, చైతూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సాయిపల్లవి మంచి మనసుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. గతంలో విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి.

ఆ వీడియోలో సాయి పల్లవి మాట్లాడుతూ తన రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న వీడియోలో.. రెమ్యునరేషన్ ఏం పెంచలేదా ? అని యాంకర్ అడగ్గా.. సాయి పల్లవి మాట్లాడుతూ.. “రెమ్యునరేషన్ పెంచలేదు.. ఎందుకంటే.. నేను డాక్టర్ గా ఉంటే అందరికీ ఫ్రీ సర్వీస్ చేయను. నిజంగా ఎవరికైతే సాయం అవసరమవుతుందో వారికే ఫ్రీ సర్వీస్ చేస్తాను.. ఎవరు ఇవ్వగల్గుతారో వాళ్లు ఇస్తారు.. కొన్ని సినిమాలు చాలా ముఖ్యం.. అక్కడ నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలని అడిగితే మూవీ బడ్జెట్‏లోనే సగం వెళ్లిపోతుంది. అది తప్పు.. సినిమాను బట్టి తీసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. బంగారం రా మా లేడీ పవర్ స్టార్.. ఇండస్ట్రీ క్వీన్.. ఇంత మంచితనమేంటమ్మా.. ఇంత మెచ్యూరిటీ ఏంటీ సాయి పల్లవి ?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us