Uday Kiran: అరె.. ఎవరితను? సేమ్ టు సేమ్ ఉదయ్‌కిరణ్‌కు అచ్చు గుద్దినట్టు ఉన్నాడు.. వీడియోలు వైరల్

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఈ మాటలకు తగ్గట్టుగానే ఒకే రూపమున్న వ్యక్తులు మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.ము ఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లను పోలిన నటీనటులు తరచూ కనిపిస్తుంటారు. వీరిని డోపెల్‌ గ్యాంగర్స్‌ అని కూడా పిలుస్తుంటారు అలా దివంగత టాలీవుడ్ దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కు అచ్చం జిరాక్స్ కాపీలా కనిపిస్తున్నాడు ఓ యువకుడు. మరి అతనెవరో తెలుసుకుందాం రండి.

Uday Kiran: అరె.. ఎవరితను? సేమ్ టు సేమ్ ఉదయ్‌కిరణ్‌కు అచ్చు గుద్దినట్టు ఉన్నాడు.. వీడియోలు వైరల్
Uday Kiran Doppel Ganger

Updated on: Feb 19, 2026 | 6:45 AM

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ధ్రువతారలా ఓ వెలుగు వెలిగాడు ఉదయ్ కిరణ్. పిన్న వయసులోనే సూపర్ హిట్స్ అందుకున్నాడు. వరుస ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ గా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. కానీ ఎవరి దిష్టి పడిందో తెలియదు కానీ అర్ధాంతరంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ వరుస పరాజయాలతో సతమతమయ్యాడు. సినిమానే ప్రాణంగా భావించిన అతను అందులో సక్సెస్ రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. చాలా చిన్న వయసులోనే అర్ధాంతరంగా తనువు చలించాడు. ఉదయ్ కిరణ్ కన్నుమూసి సుమారు 12 ఏళ్లకు పైగానే అవుతోంది. అయినా తన సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇప్పటికీ ఈ హీరోకు సంబంధించిన సినిమాలు, పాటలు టీవీలో వస్తుంటే ఎమోషనల్ అయ్యే వారు చాలా మందే ఉన్నారు. ఉదయ్ కిరణ్ బతికి ఉండి ఉంటే కచ్చితంగా సూపర్ స్టార్ అయ్యే వాడేమో అని అనుకుంటున్నారు.

ఇటీవల ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజైంది. ఈ సినిమా చూసిన అభిమానులు ఉదయ్ కిరణ్ ను గుర్తకుతెచ్చుకుని బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ కు సంబంధించిన పాటలు, ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇదే క్రమంలో సేమ్ టు సేమ్ ఉదయ్ కిరణ్ ను పోలిన ఓ యువకుడి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. రోహిత్ మిల్కీ అనే ఇన్ స్టా గ్రామ్ ఐడీతో షేర్ అవుతున్న ఈ వీడియోల్లోని వ్యక్తి సేమ్ టు సేమ్ ఉదయ్ కిరణ్ కు అచ్చుగుద్దినట్లు ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

జూనియర్ ఉదయ్ కిరణ్ అంటున్నారు..

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే రోహిత్ కు కూడా ఉదయ్ కిరణ్ కు అంటే చాలా ఇష్టం. అందుకే థియేటర్ కు వెళ్లి మరీ మనసంతా నువ్వే సినిమాను చూశాడు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు ఎక్కువగా ఉదయ్ కిరణ్ సినిమా పాటలకు రీల్స్ చేస్తూ వాటిని ఇన్ స్టాలో షేర్ చేస్తున్నాడు. అచ్చం ఉదయ్ కిరణ్ లాగానే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతని వీడియోలకు నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ఉదయ్ కిరణ్ గారిని మిస్ అయ్యాను అనుకున్న కాని మీ రూపంలో ఆ దేవుడు మళ్లీ పుట్టించాడు’ అంటూ క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. ఏకంగా రోహిత్ ను జూనియర్ ఉదయ్ కిరణ్ అంటూ ట్యాగ్స్ ఇచ్చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us