ఇది ఓవర్ యాక్షన్..! భర్త కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగిన హీరోయిన్.. ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

సోషల్ మీడియాలో హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన వీడియోతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. భర్త కాళ్లు కడిగి ఆ నీళ్లను తాగింది ఆమె.. దాంతో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ఇది ఓవర్ యాక్షన్..! భర్త కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగిన హీరోయిన్.. ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
Actress

Updated on: Jun 16, 2025 | 2:23 PM

హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంటారు. సినిమాల్లో కనిపించే సమయం తక్కువే కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా ఉంటున్నారు. తమ సినిమాల అప్డేట్స్ పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. కొంతమంది రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటారు. కొంతమంది మాత్రం చిత్ర విచిత్రమైన పోస్ట్ లు చేసి నెటిజన్స్ చేత ట్రోల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ చేసిన పనికి నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇంతకూ ఆమె చేసిన పని ఏంటంటే.. భర్త కళ్లు కడిగి ఆ నీళ్లు తాగింది. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఎలినా సమంతరాయ్ ఒడిశా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన నటన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ప్రసిద్ధి చెందిన నటి. ఈ ముద్దుగుమ్మ “Abhaya” (2017) సినిమాతో తొలిసారిగా హీరోయిన్‌గా పరిచయమైంది, ఈ చిత్రంలో ఆమె నటనకు ఒడిశా స్టేట్ ఫిల్మ్ అవార్డ్‌లో ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డు అందుకుంది. 2024 నవంబర్‌లో ఆమె అనురాగ్ పండా అనే వ్యక్తితో ఇండోనేసియాలోని బాలిలో వివాహం చేసుకుంది, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎలినా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన అభిమానులతో కనెక్ట్ అవుతుంది. ఆమె ఒడిశాలో యువతలో బాగా పాపులర్.

ఇవి కూడా చదవండి

తాజాగా ఆమె చేసిన పనికి ఇప్పుడు నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇటీవలే ఆమె సావిత్రి వ్రతం అనేది చేసింది. భర్త పాదాలను కడిగింది. దీర్ఘ సుమంగళిగా ఉండాలని దీవెనలు తీసుకుంది.. ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ ఆతర్వాత ఆమె చేసిన పనికి నెటిజన్స్ మండిపడుతున్నారు. భర్త కాళ్లు కడిగిన నీటిని తాగింది.. దానికి ఆమె భర్త తెగ పొంగిపోయి దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకున్నాడు. దానికి నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. చెయ్యి కానీ ఓవర్ చెయ్యకు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి