
చాలా మంది సినిమా తారలు అందం కోసం రకరకాల సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే.. స్టార్ హీరోయిన్స్ కూడా అందం పెంచుకునేందుకు శారీలాభాగాలకు సర్జరీలు చేయించుకున్నారు కూడా.. అయితే కొంతమంది మాత్రం ఈ సర్జరీల విషయంలో విపరీతంగా ట్రోల్ అయ్యారు. సర్జరీలు వికటించాయి అంటూ కొంతమందిని రకరకాలుగా ట్రోల్ చేశారు నెటిజన్లు. తాజాగా తెలుగమ్మాయి విషయంలోనూ అదే జరుగుతోంది. అందాల తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాలో నటనతో ఆ,కట్టుకున్న అనన్య.. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యణ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది.
అయితే హీరోయిన్ గా మాత్రం క్లిక్ అవ్వలేకపోయింది ఈ చిన్నది. ప్రస్తుతం హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటోంది. గ్లామరస్ ఫొటోస్ తో కట్టిపడేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా అనన్య షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. అనన్య ఈ ఫొటోలో చాలా అందంగా ఉంది కానీ ఆమె పెదాలు మాత్రం కొత్తగా అనిపించాయి. దాంతో అనన్య లిప్స్ కు సర్జరీ చేయించుకుందని ప్రచారం జరుగుతోంది. అనన్య లిప్స్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లుక్ తో పోలిస్తే.. పాత లుక్ లోనే ఆమె బాగున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఉన్న అందాన్ని మెయింటైన్ చేసుకోకుండా.. చెడగొట్టేసుకుంటున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.