Hanuman Ansh: 2 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్లు.. తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’.. రిలీజ్ ఎప్పుడంటే?

‘హనుమాన్‌ అంశ్'.. ప్రస్తుతం బాలీవుడ్ లో మార్మోగుతున్న చిన్న సినిమా. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ డివోషినల్ మూవీ రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ బాక్సాఫీస్ సెన్సేషన్ తెలుగులో కూడా రిలీజ్ కానుంది.

Hanuman Ansh: 2 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్లు.. తెలుగులోకి హనుమాన్ అంశ్.. రిలీజ్ ఎప్పుడంటే?
Hanuman Ansh Movie

Updated on: Sep 11, 2026 | 6:27 PM

స్టార్స్ లేరు. పెద్ద పెద్ద ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ లేవు. స్పెషల్ సాంగ్స్ సంగతే లేదు. అయినా ఒక చిన్న సినిమా కంటెంట్ తో కోట్లు కొల్లగొడుతోంది. అదే ‘హనుమాన్ అంశ్’. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమా ట్యాగ్ తో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. రికార్డు కలెక్షన్లు సాగిస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రస్తుతం కేవలం హిందీలో ఉన్న ఈ సినిమాను ఇతర భాషల్లోకి అనువదించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాను చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరనుంది. హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో విడుదల చేసే బాధ్యతలను తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నమ్రతా సింగ్ స్వయంగా వెల్లడించడంతో తెలుగు ఆడియెన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీ వెలువడనుంది. అయితే సెప్టెంబర్ 18 నుంచి హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది.

హనుమాన్ అంశ్ సినిమా విషయానికి వస్తే.. భక్తి, దైవిక అంశాల నేపథ్యంలో ఎంతో ఎంగేజింగ్ గా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ విశాల్ చతుర్వేది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన హనుమంతుడిపై ఉన్న భక్తి, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ సినిమా అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ డివోషినల్ బయోపిక్ డ్రామాలో శోభినవ్ సత్య ప్రధాన పాత్ర పోషించారు. అలాగే పూర్ణిమ తివారి, చందన్ కే ఆనంద్, రాజు మిశ్రా, రిషికేష్ ధూబే , ఋషి పతాక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ.2 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 7 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు కేవలం రూ.10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే ఆ తర్వాత మౌత్ టాక్ తో ఈ సినిమాకు కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. మరి హిందీలో రికార్డుల మోత మోగించిన హనుమాన్ అంశ్ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

హనుమాన్ అంశ్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us