AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: 40 ఏళ్ల క్రితం నాటి పాట.. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. మళ్లీ మళ్లీ వింటారు

40 సంవత్సరాల క్రితం నాటి ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇక తెలుగు, హిందీ సినిమాల్లోనూ ఈ సాంగ్ ను తెగ వాడేస్తున్నారు. అంతలా ఏముందీ సాంగ్ లో..

Trending Song: 40 ఏళ్ల క్రితం నాటి పాట.. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. మళ్లీ మళ్లీ వింటారు
Trending Song
Basha Shek
|

Updated on: Sep 11, 2026 | 7:50 AM

Share

1980-90వ దశకంలో సోషల్ మీడియా ఉండేది కాదు. ఎక్కువగా రేడియో, క్యాసెట్ ప్లేయర్లే ప్రధాన వినోద సాధనాలుగా ఉండేవి. అయితే అలాంటి సమయంలోనే ఒక పాట సంచలనం సృష్టిచింది. భాష అర్థం కాని వారు సైతం ఈ పాటకు లేచి నిలబడి డ్యాన్స్ చేసేలా ఉర్రూతలూగించింది. ఈ పాటకున్న ప్రజాదరణ ఎంత గొప్పదంటే, దశాబ్దాలు గడిచినా దాని క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ‘ధురందర్’ చిత్రంలో కూడా ఈ పాటను ఉపయోగించారు. అంతకు ముందు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి లోనూ ఓ ఫైట సీన్ లోనూ ఈ ఎవర్ గ్రీన్ సాంగ్ ను వాడేశారు. ఇంతకీ ఆ పాట ఏదనుకుంటున్నారా? ‘హవా హవా’.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఈ పాట పాకిస్తాన్ లో పుట్టింది. పాకిస్తానీ పాప్ గాయకుడు హసన్ జహంగీర్ పాడిన ఈ పాట 1986లో రికార్డ్ చేయగా, 1987లో విడుదలైంది. ఈ పాటలోని ఆకట్టుకునే బీట్, బాణీల కారణంగా ఇది అతి తక్కువ సమయంలోనే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పెద్ద హిట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ పాట రేడియోలో తరచుగా టెలికాస్ట్ చేసేవారు. అంతేకాదు ఈ సాంగ్ క్యాసెట్లు కూడా భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి.

హవా హవా పాటకున్న స్పెషాలిటీ ఏంటంటే..ఈ పాట బీట్ ఏ భాషకైనా సులభంగా ఇమిడిపోయే విధంగా ఉంటుంది. అందువల్ల హిందీలో ఉన్నప్పటికీ ఈ సాంగ్ ట్యూన్ అన్ని భాషల వారిని ఆకట్టుకుంటోంది. ‘హవా హవా ఐ హవా’ కేవలం ఒక ప్రజాదరణ పొందిన పాటగా మాత్రమే కాకుండా, ఆనాటి ఒక తరం మొత్తం జ్ఞాపకాలలో ఒక భాగంగా నిలిచింది. ఈ పాట కథ పాకిస్తాన్‌లో కాదు, ఇరాన్‌లో మొదలవుతుంది. 1970వ దశకంలో, ఇరాన్ సైకడెలిక్ రాక్ సంగీతానికి పితామహుడిగా పరిగణించబడే కౌరోష్ యగ్మాయ్, ‘హవా హవా’ అనే పర్షియన్ పాటను ప్రదర్శించారు. ప్రేమ, నిరీక్షణ భావాలను వ్యక్తపరిచే ఈ పాట బాణీ, ఆ తర్వాత సరిహద్దు దాటి ఇరాన్‌కు చేరింది.

దశాబ్దాలు గడుస్తున్నా, ‘హవా హవా ఐ హవా’ పాట ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. ‘ధురందర్’ చిత్రంలో సంజయ్ దత్ ఎంట్రీ కోసం ఈ పాటను ఉపయోగించడంతో, ఇది మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తన్నాయి. ఈ పాట పాకిస్తాన్ నుండి పుట్టడం, దాని వెనుక ఉన్న ఇరానియన్ బాణీ, ఆ తర్వాత బాలీవుడ్‌లో దాని ప్రయాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ‘హవా హవా ఐ హవా’ కేవలం ఒక పాట మాత్రమే కాదు, సరిహద్దులను దాటి సంగీతం ఎంత ప్రజాదరణ పొందుతోందనడానికి ఇది ఒక అసాధారణ ఉదాహరణ.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ లో హవా హవా సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us