
లేడీ సూపర్ స్టార్ నయనతార సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న “ముఖ్తి అమ్మాన్” చిత్రంలో నయన్.. దేవత పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన న్యూ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భారీ ఆభరణాలు ధరించిన నయన్ ఓ చేతిలో త్రిశూలం పట్టుకుని ఎరుపు, ఆకుపచ్చ చీరలో ప్రకాశవంతంగా మెరిసిపోయారు. అమ్మవారిగా కనిపిస్తున్న నయనతార ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆదిశక్తిగా నయనతార సరిగ్గా సరిపోయారంటూ ఆమె అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే నయనతార ఇప్పటివరకు ఎన్నో పాత్రల్లో నటించింది కానీ, అమ్మవారిగా కనిపించడం మాత్రం ఇదే తొలిసారి కావటం విశేషం.