యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తోన్న లేటెస్ట్ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ . ఇంట్రెస్టింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. నేచురల్ స్టార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. గోల్కొండ హైస్కూల్ లో సంతోష్ శోభన్ నటన చూసి చాలా ఇంప్రెస్ అయ్యా. చాలా పరిణితితో నటించాడు. అప్పుడే దర్శకుడు ఇంద్రగంటి గారితో చెప్పాను. సంతోష్ లో నన్ను చూసుకున్నా. మేమిద్దరం ఇంద్రగంటి స్కూల్ నుండే వచ్చాం. సంతోష్ చాలా సినిమాలు చేయడం ఆనందంగా వుంది. లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ తో వరుసగా విజయాలు రావాలని కోరుకుంటున్నాను. ఫారియా అద్భుతమైన యాక్టర్. జాతిరత్నాలు నాకు చాలా ఇష్టం అని అన్నారు నాని.
అలాగే బ్రహ్మాజీ గారు ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర చేశారని గాంధీ చెప్పారు. గాంధీతో కాసేపు మాట్లాడితే నచ్చేస్తాడు. మారుతి గారిని కలవడం చాలా ఆనందంగా వుంది. వెంకట్ బోయినపల్లి గారు ఒకసారి ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటాను. కిరణ్, సుదర్శన్ .. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నవంబర్ 4న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ థియేటర్స్ లోకి వస్తోంది. సినిమా ఘన విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.