ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో నటుడు మృతి.. ప్రేక్షకులను నవ్విస్తూ వెళ్లిపోయిన కమెడియన్..

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడిగా, హాస్య నటుడిగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటుడు సలీమ్ కుమార్ కన్నమూశారు. దాదాపు మూడు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించి. కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో నటుడు మృతి.. ప్రేక్షకులను నవ్విస్తూ వెళ్లిపోయిన కమెడియన్..
Salim Kumar

Updated on: Jun 07, 2026 | 11:36 AM

మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు, జాతీయ అవార్డు గ్రహీత అయిన నటుడు సలీం కుమార్ శనివారం (జూన్ 6) రాత్రి కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు. న్యుమోనియా, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను శనివారం ఉదయం ఆసుపత్రిలో చేర్చగా, వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే, చికిత్స ఫలించకపోవడంతో శనివారం రాత్రి సుమారు 10.43 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. సలీం కుమార్‌కు భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కుమారుడు చందు ఇటీవల ‘మంజుమ్మేల్ బాయ్స్’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించడం గమనార్హం. సలీం కుమార్ మరణం పట్ల మాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. సూపర్‌స్టార్ మమ్ముట్టి తన ట్విట్టర్ ఖాతాలో ఎంతో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

“ఇతరులను నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ, కొన్నిసార్లు ఏడ్పించి, వారి గుండెల్లో నీళ్లు కార్చే సలీం. ఇప్పుడు నన్ను ఏడ్పిస్తూ వదిలి వెళ్ళిపోయావు. నీ వీడ్కోలు అంతులేని నిశ్శబ్దాన్ని, అపారమైన దుఃఖాన్ని మిగిల్చింది, అన్నా,” అని మమ్ముట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నారు. 90వ దశకం చివర్లో మిమిక్రీ కళాకారుడిగా, హాస్యనటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన సలీం కుమార్, కేవలం హాస్య పాత్రలకే పరిమితం కాకుండా ఒక అద్భుతమైన సహాయ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 2005లో ‘అచ్చానురంగత వీడు’ చిత్రంలో తన నటనకు గాను ఆయన కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు. అలాగే, 2010లో విడుదలైన ‘ఆడమింతే మకన్ అబు’ చిత్రంలో తన నటనకు గాను ఆయన జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

సలీం కుమార్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీషన్ , పలువురు ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘ఆయన కేవలం ఒక సినీ నటుడు మాత్రమే కాదు, మాకు కుటుంబ సభ్యుడిలాంటివారు’ అని సతీషన్ గుర్తుచేసుకున్నారు. మలయాళ సినీ నటుడు దిలీప్‌తో సహా పలువురు తారలు సలీం కుమార్‌కు తమ చివరి నివాళులు అర్పించేందుకు ఆసుపత్రికి తరలివచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

మమ్ముట్టీ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

Loading...
Unable to load recommendations.
Follow Us