Narappa : ప్రత్యర్ధుల పైకి ఎగబడుతూ కత్తి దూస్తూన్న నారప్ప.. మేకింగ్ వీడియో

అసురన్ రీమేక్ గా వచ్చిన నారప్ప సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది. థియేటర్స్ అందుబాటులో లేకపోవడంతో.. ఓటీటీ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Narappa : ప్రత్యర్ధుల పైకి  ఎగబడుతూ కత్తి దూస్తూన్న నారప్ప.. మేకింగ్ వీడియో
Narappa

Updated on: Jul 25, 2021 | 8:30 PM

Narappa : అసురన్ రీమేక్‌‌‌‌గా వచ్చిన నారప్ప సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది. థియేటర్స్ అందుబాటులో లేకపోవడంతో.. ఓటీటీ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్‌‌తో దూసుకుపోతుంది నారప్ప. వెంకటేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఒరిజినల్‌‌‌ను ఎక్కడ గుర్తుచేయకుండా తన నటనతో ఆకట్టుకున్నారు వెంకటేష్. ఇప్పటికే నారప్ప పై సినిమా తారలంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. వెంకటేష్ నటనకు ఆయన చూపించిన వేరియేషన్స్‌‌ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా నారప్పలోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలిచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలోని ఫైట్స్‌‌‌ను పీటర్ హెయిన్స్ కొరియోగ్రాఫ్ చేశారు.

ఈ విజువల్స్‌‌‌లో వెంకీ యాక్షన్ చూస్తే నిజంగానే ఒళ్ళు జలదరిస్తుంది. రౌడీల పై ఎగబడుతూ కత్తి దూస్తూన్న వెంకటేష్‌‌‌ను చూస్తే నిజంగానే వణుకు పుడుతుంది. ఈ సన్నివేశాలకోసం ఆయన ఎంత కష్టపడ్డారో ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతోంది. బిహైండ్ ది స్క్రీన్ సపోర్టర్స్ ని స్నీక్ పీక్ పేరుతో ఇలా వీడియో రూపంలో ఆవిష్కరించారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nidhhi Agerwal: వాన పాటలు చూడటాన్నికి బాగుంటాయి..కానీ చేయడానికే చిరాకు అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

‘చోర్ బజార్’లో గన్ పట్టుకొని నిలుచున్న ఆకాష్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్‌‌‌‌లుక్ పోస్టర్..

Actor Karthik Ratnam: ఒక్క ఛాన్స్.. ఆ హీరో తో ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న నారప్ప తనయుడు

Loading...
Unable to load recommendations.
Follow Us