Nandamuri Balakrishna: దర్శకత్వం బాల‌య్య‌.. హీరో మోక్షజ్ఞ.. మ‌రో క్రేజీ విష‌యం ఏమిటంటే..

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూడా గతంలోనే మోక్షజ్ఞ డెబ్యూ గురించి...

Nandamuri Balakrishna: దర్శకత్వం బాల‌య్య‌.. హీరో మోక్షజ్ఞ.. మ‌రో క్రేజీ విష‌యం ఏమిటంటే..
Nandamuri Mokshagna Teja

Updated on: Jun 11, 2021 | 4:24 PM

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూడా గతంలోనే మోక్షజ్ఞ డెబ్యూ గురించి మాట్లాడినా… అప్పట్లో సాధ్యం కాలేదు. కానీ ఫైనల్‌గా ఆ రోజు త్వరలోనే రాబోతోంది. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ స్వయంగా కన్ఫార్మ్ చేశారు. యస్… బాలయ్య వారసుడు త్వరలో వెండితెర మీద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు మోక్షజ్ఞ. తొలి సినిమాలోనూ తండ్రితో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాకు మరో స్పెషలిటీ కూడా ఉంది. ఈ ప్రస్టీజియస్‌ ప్రాజెక్ట్‌కు కథ, దర్శకత్వం కూడా బాలయ్య బాబే. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిత్య 369 అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ సినిమా తెలుగు ఆడియన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌. అందుకే చాలా కాలంగా సీక్వెల్‌ కోసం ప్లాన్ చేస్తున్నారు నందమూరి నటసింహం.

చాలా మంది రైటర్స్‌ను సంప్రదించినా.. ఎగ్జైటింగ్‌ స్క్రిప్ట్ రెడీ అవ్వకపోవటంతో ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. ఫైనల్‌గా బాలయ్యే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ రాసేశారు. ఎన్టీఆర్‌ తనను ఎలా వెండితెరకు పరిచయం చేశారో… అలాగే.. మోక్షజ్ఞను కూడా తాను తెరకు పరిచయం చేయబోతున్నా అని గర్వంగా ఎనౌన్స్ చేశారు బాలకృష్ణ.

Also Read : సీనియ‌ర్ న‌టి మీనా ఖాతాలో రేర్ అండ్ రేరెస్ట్ ఫీట్.. నెవ్వ‌ర్ బిఫోర్

మరో ప్రాజెక్ట్‏కు రవితేజ గ్రీన్ సిగ్నల్ .. వచ్చే నెలలో సెట్స్ పైకి మాస్ మహారాజా న్యూమూవీ.. అప్‏డేట్ ఇచ్చిన డైరెక్టర్..

Loading...
Unable to load recommendations.
Follow Us