Nandamuri Balakrishna: క్రేజీ కాంబో.. గ్రాండ్‌గా ప్రారంభమైన నటసింహం నయా మూవీ NBK 108..

వీరసింహ రెడ్డి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

Nandamuri Balakrishna: క్రేజీ కాంబో.. గ్రాండ్‌గా ప్రారంభమైన నటసింహం నయా మూవీ NBK 108..
Balakrishna

Updated on: Dec 08, 2022 | 2:57 PM

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తి చేశారు. వీరసింహ రెడ్డి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శ్రుతిహాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఇప్పుడు  సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నారు. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.

ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, కిలారు సతీష్, నిర్మాత శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ రోజు నుండే యాక్షన్ బ్లాక్ తో ప్రారంభం కానుంది.  ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మించారు.

బాలకృష్ణ మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను రాశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ తమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ మూవీ పక్క హిట్ అంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

Nbk 108

 

Loading...
Unable to load recommendations.
Follow Us